ప్రజాశాంతి పార్టీ(Prajashanthi Party) అధ్యక్షుడు కేఏ పాల్(KA Paul).. ప్రజా గాయకుడు, ప్రజా యుద్ధనౌక గద్దర్‌ను(Gaddar) పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ మేరకు పార్టీ జనరల్ సెక్రెటరీ వి మమతా రెడ్డి(V.Mamatha Reddy) ఓ ప్రకటన విడుదల చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న గద్దర్‌ను..

Gaddar Praja Party
ప్రజాశాంతి పార్టీ(Prajashanthi Party) అధ్యక్షుడు కేఏ పాల్(KA Paul).. ప్రజా గాయకుడు, ప్రజా యుద్ధనౌక గద్దర్‌ను(Gaddar) పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ మేరకు పార్టీ జనరల్ సెక్రెటరీ వి మమతా రెడ్డి(V.Mamatha Reddy) ఓ ప్రకటన విడుదల చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న గద్దర్‌ను.. అధ్యక్షుల ఆదేశాల మేరకు పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగిందని ప్రకటనలో పేర్కొన్నారు. ఇదిలావుంటే.. గద్దర్ కొత్త రాజకీయ పార్టీని ప్రకటించనున్నారు. తన పార్టీకి 'గద్దర్ ప్రజాపార్టీ' (Gaddar Praja Party)అని నామకరణం కూడా చేశారు. పార్టీ రిజిస్ట్రేషన్ కోసం ఆయన ఢిల్లీకి వెళ్లినట్లు తెలుస్తోంది. రిజిస్ట్రేషన్ అనంతరం అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
