సిద్దిపేట(Sidipet) జిల్లాలో సంచలన ఘటన చోటు చేసుకుంది. సిద్ధిపేట జిల్లా కలెక్టర్(collector) గన్‌మెన్‌గా(Gunman) పని చేస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ ఆకుల నరేష్(Akula Naresh) గన్(Gun) తో కాల్చుకుని ఆత్మహత్యకు(Suicide) పాల్పడటం కలకలం రేపింది. భార్య, ఇద్దరు పిల్లలను చంపి..తాను తుపాకీతో కాల్చుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మెదక్(Medak) జిల్లాలోని చిన్నకోడూరు మండలం రామునిపట్ల గ్రామంలో ఈ దారుణ ఘటన జరిగింది.

స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం..చిన్నకోడూర్(chinnakodur) మండలం రామునిపట్ల గ్రామానికి చెందిన ఆకుల నరేష్.. సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ వద్ద గన్‌మెన్‌గా పనిచేస్తున్నారు. నరేష్‌కు భార్య చైతన్య, కుమారుడు రేవంత్, కుమార్తె హిమశ్రీ ఉన్నారు. శుక్రవారం నరేశ్ విధులకు వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉన్నాడు. తన వెంట తెచ్చుకున్న 9 ఎంఎం పిస్టల్‌తో భార్య, ఇద్దరు పిల్లలను చంపి..తనను తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విధులకు రాకపోవడంతో అనుమానం వచ్చిన సిబ్బంది ఇంటికి వెళ్లి చూడగా రక్తపు మడుగులో ఉన్న నలుగురిని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఆర్థిక వ్యవహారాలే నరేష్ ఆత్మహత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. అభంశుభం తెలియని చిన్నారులతోపాటు భార్యాభర్తలిద్దరూ ఒకేసారి మృతి చెందడంతో రామునిపట్ల గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి