ఒక్కోసారి మీటర్‌కు మించి మాట్లాడితే కొంపలు మునగే ప్రమాదం ఉంటుంది.
ఒక్కోసారి మీటర్‌కు మించి మాట్లాడితే కొంపలు మునగే ప్రమాదం ఉంటుంది. నటుడు సిద్ధార్థ్‌కు(Siddharth) ఈ విషయం తెలియక అప్పుడప్పుడు ఏదేదో వాగేస్తుంటాడు. తర్వాత నాలిక్కర్చుంటారు. అడిగిన ప్రశ్నకు సింపుల్‌గా బదులివ్వకుండా ఉపన్యాసం ఇచ్చుకుంటూ వెళితే ఇలాగే అవుతుంది మరి! భారతీయుడు 2(Indian 2) ప్రెస్‌మీట్ అయ్యింది కదా! విలేకరులు ఎవరిని అడిగితే వారే కదా జవాబివ్వాల్సింది. కానీ ప్రెస్‌వాళ్లు ఎవరిని ఏ ప్రశ్న అడిగినా మధ్యలో దూరిపోయి సిద్ధార్థే సమాధానం ఇచ్చాడు. ఓ విలేకరి మీరు కూడా ప్రభుత్వం అడిగినట్టు యాంటీ డ్రగ్స్ వీడియో(anti drug video) చేస్తున్నారా అని అడిగాడు. దానికి సిద్ధార్థ్ చేస్తామనో చేయమనో లేదూ ఆల్రెడీ చేసేశామనో చెబితే సరిపోయేది. అలా కాకుండా ఏదేదో చెప్పుకుంటూ వచ్చాడు. తనకు సామాజిక బాధ్యత ఎక్కువని, ప్రభుత్వం చెబితే చేయడం కాదని, తాను ఇలాంటివి చాలా చేశానని ఎక్సెట్రా ఎక్సెట్రా చెప్పుకొచ్చాడు. నిజానికి అంతకు ముందు రోజే భారతీయుడు 2 సినిమా యూనిట్ యాంటీ డ్రగ్స్ వీడియో బైట్ ఇచ్చారు. ఈ విషయాన్నే సిద్ధార్థ్ చెబితే అయిపోయేది. ప్రెస్‌మీట్ అయ్యాక ఎక్కడివారు అక్కడికెళ్లిన తర్వాత సిద్ధార్థ్‌కు విషయం అర్థమయ్యింది. రాత్రి ఓ సవరణ ఇచ్చుకున్నాడు. తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారన్నాడు. అసలు జరిగిందేమిటంటే ప్రెస్‌మీట్‌లో సిద్ధార్థ్ అలా మాట్లాడేసరికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తమ్ముడు కొండల్‌రెడ్డి(Kondal reddy) రంగంలోకి దిగారట! భారతీయుడు 2 నైజాం డిస్ట్రిబ్యూటర్లు సురేశ్‌బాబు, సునీల్ నారంగ్‌లతో మాట్లాడరట! ముఖ్యమంత్రి యువత భవిష్యత్తు కోసమే ఓ మంచి మాట చెప్పామన్నారు కానీ సొంత ప్రయోజనాల కోసం కాదు కదా అని కొండల్‌రెడ్డి కాసింత కోపంగానే అన్నారట! దాంతో అప్పటికే ఫ్లయిట్ ఎక్కిన సిద్ధార్థ్‌కు అర్టెంట్‌గా కాల్ చేసి అసలు విషయం చెప్పారట! అంతే విమానం దిగగానే సిద్ధార్థ్ చేసిన మొదటి పని వివరణ వీడియోను రిలీజ్ చేయడం. దీన్నిబట్టి తెలిసిందేమిటంటే ఏదిపడితే అది మాట్లాడకూడదు..