ఓ మహిళ తన భర్త తనను హింసిస్తున్నాడని(Domestic Voilence) పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదును తీసుకున్న సదరు సారు గారు.. మెల్లగా ఆమెను ట్రాప్ చేశాడు. ఈ సంఘటన జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్(Ibrahimpatnam Police Station) పరిధిలో జరిగింది.
ఓ మహిళ తన భర్త తనను హింసిస్తున్నాడని(Domestic Voilence) పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదును తీసుకున్న సదరు సారు గారు.. మెల్లగా ఆమెను ట్రాప్ చేశాడు. ఈ సంఘటన జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్(Ibrahimpatnam Police Station) పరిధిలో జరిగింది. ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన యువతితో ఇదే మండలంలోని వర్షకొండకు చెందిన యువకుడితో వివాహమైంది. ఈ జంటకు ఇద్దరు సంతానం. కొద్ది రోజులుగా భార్యభర్తల మధ్య విభేదాలు వచ్చాయి. భార్యపై యువకుడు చేయికూడా చేసుకునేవాడు. ఈ క్రమంలోనే తనకు న్యాయం చేయాలని, తన భర్త హింసిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది యువతి. ఫిర్యాదు తీసుకున్న ఏఎస్సై రామయ్య ఫిర్యాదు పేరుతో ఆమెకు స్నేహ హస్తం అందించాడు. అది కాస్త మరింత సన్నిహితంగా మారింది. తరుచుగా ఫోన్‌లో మాట్లాడేవాడు. ఈ మధ్య కాలంలో ఓ గుడిలో ఇద్దరు కలిసి ఫొటో తీయించుకున్నారు. అది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్థానికంగా ఈ వ్యవహారం చర్చనీయాంశమైంది. దీంతో ఏఎస్సైని ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఎస్పీ సన్‌ప్రీత్‌సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు.