కొన్ని పార్టీలు తనపై వచ్చిన ఆరోపణలలో స్వార్థపూరితంగా వాడుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, వాటితో తనకు ఎటువంటి సంబంధం లేదని సస్పెన్షన్ గురైన జగిత్యాల రూరల్ ఎస్సై అనిల్ కుమార్ తేల్చి చెప్పారు.

SI Anil Kumar said he has nothing to do with Jagtial Bandh
రేపు జగిత్యాల(Jagityal) పట్టణ బంద్(Bundh)కు విశ్వ హిందూ పరిషత్(Vishwa Hindu Parishad), బజరంగ్ దళ్(Bajarang Dal) పిలుపునిచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఎస్సై అనిల్(SI Anil Kumar) కు మద్దతుగా సస్పెన్షన్(Suspension) ను ఎత్తివేయాలని డిమాండ్(Demand) చేస్తూ విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ జగిత్యాల పట్టణ బంద్ కి ఆ పిలుపునిచ్చాయనేది సారాంశం. ఈ వార్తలను ఎస్సై అనిల్ ఖండించారు. కొన్ని పార్టీలు తనపై వచ్చిన ఆరోపణలలో స్వార్థపూరితంగా వాడుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, వాటితో తనకు ఎటువంటి సంబంధం లేదని సస్పెన్షన్ గురైన జగిత్యాల రూరల్(Jagityal Rural) ఎస్సై అనిల్ కుమార్ తేల్చి చెప్పారు. ఒక పార్టీ తలపెట్టిన పట్టణ బంద్ తో తనకు ఎటువంటి సంబంధం లేదని చెప్పారు. ఈ మేరకు ఆయన ఒక వీడియోను విడుదల చేశారు.
వీడియో సందేశంలో ఆయన మాట్లాడుతూ.. గత కొన్ని సంవత్సరాలుగా జిల్లాలో పని చేస్తున్నానని, ఎటువంటి కల్మషాలు లేకుండా శాంతి భద్రత పరిరక్షణకు నిబద్ధతతో వ్యవహరించానని తెలిపారు. ఇటీవల తనపై వచ్చిన ఆరోపణల రీత్యా క్రమశిక్షణ చర్యల మీద పోలీసు నియమ నిబంధల ప్రకారం చట్టపరంగా పరిష్కరించుకుంటానని అన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు, ఒక వర్గానికి చెందిన ప్రజలు సామాజిక మాధ్యమాల్లో చేస్తున్న ప్రచారంతో తనకు సంబంధం లేదని తేల్చి చెప్పారు. వారి స్వార్థ ప్రయోజనాల కోసమే అలా చేస్తున్నారని స్పష్టం చేశారు. తన పేరిట శనివారం రోజున బంద్‌కు పిలుపునిచ్చినట్లు తనకు తెలిసిందని, ఆ బంద్‌కు, తనకు ఎటువంటి సంబంధం లేదని అన్నారు.
