రైతన్న నెత్తిన మరో పిడుగు పడింది. డీఏపీ ధర(DPA) బస్తాపై రూ.300 పెంచారు.
రైతన్న నెత్తిన మరో పిడుగు పడింది. డీఏపీ ధర(DPA) బస్తాపై రూ.300 పెంచారు. ప్రస్తుతం బస్తా రూ.1350 ఉన్న ధర రూ. 1650కి పెరిగింది. ఒక్కో బస్తాపై ఏకంగా రూ.300 పెరిగిపోవడంతో రైతులు(Farmer) ఆందోళన చెందుతున్నానరు. ప్రస్తుతం 50 కిలోల బస్తా డీఏపీ ధర రూ.1,350 ఉండగా.. రూ.1,650కు పెంచడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పెంపు పాత స్టాక్‌కు వర్తించదని అధికా రులు చెప్తున్నా.. వ్యాపారులు మాత్రం పాత స్టాక్‌కు కూడా కొత్త ధర వసూలు చేస్తున్నారు. ఓ వైపు రాష్ట్రంలో డీఏపీ కొరత ఉంది, ధరలు కూడా పెరగడంతో వ్యాపారులు అధిక రేట్‌కు విక్రయిస్తుండడంతో రైతులపై అధిక భారం పడుతోంది. యాసంగి సీజన్ పంటల సాధారణ సాగు విస్తీర్ణం 63.54 లక్షల ఎకరాలుకాగా.. ఇప్పటివరకు 3.14 లక్షల ఎకరాల్లో సాగు మొదలైంది. దీంతో డీఏపీ కచ్చితంగా రైతులు వాడుతారు. యాసంగి సీజన్‌కు 20వేల టన్నుల నుంచి 30వేల టన్నుల వరకు డీఏపీ అవసరమని.. వచ్చే వారం దాదాపు 9 వేల టన్నుల స్టాక్ రాష్ట్రానికి రానుందని మార్క్‌ఫెడ్ ఎండీ శ్రీనివాసరెడ్డి తెలిపారు.