ఇబ్రహీంపట్నంలో కులహంకారంతో సొంత అక్కనే చంపేశాడో దుర్మార్గపు తమ్మడు.
ఇబ్రహీంపట్నంలో కులహంకారంతో సొంత అక్కనే చంపేశాడో దుర్మార్గపు తమ్మడు. హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న నాగమణిని సొంత తమ్ముడే హత్య చేశాడు. రాయపోల్‌కు చెందిన శ్రీకాంత్(Srikanth),నాగమణి(Nagamani)లు నవంబర్ ఒకటో తేదీన యాదగిరిగుట్ట(Yadagirigutta)లో ప్రేమ వివాహం చేసుకున్నారు.పెళ్లి తర్వాత హయత్‌నగర్‌లో నాగమణి, శ్రీకాంత్ నివాసం ఉంటున్నారు. నిన్న సెలవు కావడంతో నాగమణి తన సొంత గ్రామానికి వెళ్ళింది. నాగమణి రోడ్డుపై వెళుతుండగా వెంబడించిన తమ్ముడు పరమేష్(Paramesh) తొలుత ఆమెను కారుతో ఢీకొట్టి అనంతరం కొడవలితో మెడ నరికి చంపాడు.రాయపోలు నుంచి ఎండ్లగూడ వెళ్లే రహదారిపై ఈ ఘటన జరిగింది. హత్య చేసిన పరమేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గతంలో నాగమణికి వివాహం జరిగింది. పది నెలల కిందట భర్తతో విడాకులు తీసుకుని నెల రోజుల కిందట మరో వ్యక్తిని కులాంతర వివాహం చేసుకుంది.