☰
✕
బీఆర్ఎస్ అభ్యర్ధుల జాబితా విడుదల చేయడంతో అసంతృప్తులు పార్టీని వీడేందుకు సిద్దమయ్యారు. ఖానాపూర్ టికెట్ దక్కకపోవడంతో రేఖ నాయక్ బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరాలని నిశ్చయించుకున్నారు.
x
బీఆర్ఎస్(BRS) అభ్యర్ధుల జాబితా విడుదల చేయడంతో అసంతృప్తులు పార్టీని వీడేందుకు సిద్దమయ్యారు. ఖానాపూర్(Khanapur) టికెట్ దక్కకపోవడంతో రేఖ నాయక్(Rekha Naik) బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్(Congress)లో చేరాలని నిశ్చయించుకున్నారు. ఇప్పటికే రేఖ నాయక్ భర్త శ్యామ్ నాయక్ కాంగ్రెస్‌లో చేరారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy).. శ్యామ్ నాయక్(Shyam Naik) కు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఏఐసీసీ ఇంఛార్జ్ మాణిక్‌రావ్ ఠాక్రే(Manikrao Thackrey) తో శ్యామ్ నాయక్ భేటీ అయ్యారు.
మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు(Mynampalli Hanumantharao)ది విచిత్ర పరిస్థితి. టికెట్ కేటాయించినప్పటికీ పార్టీలో ఉండలేని పరిస్థితి. కొడుకు టికెట్ కోసం హరీష్ రావు(Harish Rao)పై నోరుపారేసుకున్న మైనంపల్లి.. బీఆర్ఎస్ ఉందామన్నా పార్టీ వేటువేస్తుందేమోనన్న పరిస్థితి. ఈ క్రమంలో ఆయన పార్టీ వీడేందుకు సిద్ధమవుతున్నారు. తండ్రి కొడుకులకు టికెట్ ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ సుముఖంగా ఉన్నట్లు.. మరో రెండు రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని మైనంపల్లి వర్గీయులు అంటున్నారు. మల్కాజిగిరి(Malkajgiri) నుంచి మైనంపల్లి హనుమంతరావుకు, మెదక్(Medak) నుంచి మైనంపల్లి రోహిత్(Mynampalli Rohit)కు టికెట్లు ఇచ్చేందుకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఒప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై మైనంపల్లి స్పందించాల్సివుంది.
Yagnik
Next Story