☰
✕
పవిత్ర కార్తీక మాసంలో(Karthika masam) శివమూర్తి దర్శనం మహాపుణ్యం.
x
పవిత్ర కార్తీక మాసంలో(Karthika masam) శివమూర్తి దర్శనం మహాపుణ్యం. ఆ పుణ్యం వడగం సత్తిబాబుకు లభించింది. అల్లూరి సీతారామరాజు(Alluri sita ramaraju) జిల్లా కొయ్యూరు(Koyuru) మండలం బంధుమామిళ్ల గ్రామానికి చెందిన సత్తిబాబు పొలం పనులు చేసుకుంటున్నప్పుడు శివలింగం(shivalingam) బయటపడింది. కార్తీకమాసం శివలింగం ప్రత్యక్షం కావడంతో ఆ లింగానికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు భక్తులు. ఎప్పటిలాగే సత్తిబాబు తన వ్యవసాయభూమిలో పొలంపనులు చేసుకుంటున్నప్పుడు పనిముట్టుకు ఏదో తగిలినట్టు అనిపించింది. వెంటనే తవ్వి చూశాడు. శివలింగం బయటపడటంతో మొదట ఆశ్చర్యపోయాడు. తర్వాత తన్మయత్వం చెందాడు. భక్తితో కొలిచాడు. ఈ విషయం గ్రామస్తులకు తెలిసింది. శివలింగ దర్శనం కోసం భారీగా తరలివచ్చారు. కార్తీక మాసం మూడో సోమవారం కావడంతో ఆ ప్రాంతం ఓ తీర్థంలా మారింది.
Eha Tv
Next Story