ఆకమాస్తుల కేసులో ఏసీబీ అధికారుల కస్టడీలో ఉన్న శివ బాలకృష్ణను(Shiva Balakrishna) విచారిస్తున్న కొద్దీ సంచలనాలు వెలుగు చూస్తున్నాయి. హెచ్ఎండీఏ లో తొమ్మిదేళ్లుగా కింగ్ మేకర్‌గా ఉన్నాడు శివ బాలకృష్ణ కోట్లాది రూపాయల సొమ్మును అక్రమంగా సంపాదించాడు. అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం అర్వింద్ కుమార్(Arvind Kumar) స్పెషల్ చీఫ్ సెక్రటరీగా, హెచ్ఎండీఏ కమిషనర్‌గా రావడంతో వసూళ్లతో రెచ్చిపోయాడు శివ బాలకృష్ణ.
ఆకమాస్తుల కేసులో ఏసీబీ అధికారుల కస్టడీలో ఉన్న శివ బాలకృష్ణను(Shiva Balakrishna) విచారిస్తున్న కొద్దీ సంచలనాలు వెలుగు చూస్తున్నాయి. హెచ్ఎండీఏ లో తొమ్మిదేళ్లుగా కింగ్ మేకర్‌గా ఉన్నాడు శివ బాలకృష్ణ కోట్లాది రూపాయల సొమ్మును అక్రమంగా సంపాదించాడు. అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం అర్వింద్ కుమార్(Arvind Kumar) స్పెషల్ చీఫ్ సెక్రటరీగా, హెచ్ఎండీఏ కమిషనర్‌గా రావడంతో వసూళ్లతో రెచ్చిపోయాడు శివ బాలకృష్ణ. హెచ్ఎండీఏ లో డబుల్ రోల్-డబుల్ క్యాష్ పద్ధతిలో బిల్డర్లకు, రియల్టర్లకు, ఇన్‌ఫ్రా ఓనర్లకు, ల్యాండ్ వెంచర్ల యజమానుల ఫైల్స్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అర్వింద్ కుమార్‌తో కలిసి డబుల్ డీల్స్ సెట్ చేశాడు శివ బాలకృష్ణ. HMDA లో ప్లానింగ్ డైరక్టర్‌గా శివ బాలకృష్ణ.. కమీషనర్‌గా అర్వింద్ కుమార్ ఇద్దరూ రెచ్చిపోయారు. అయితే, MAUD లో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా అర్వింద్ కుమార్. అదే సచివాలయం MAUD లో డైరెక్టర్ హోదాలో శివ బాలకృష్ణ ఉన్నారు. దీంతో, ఒకే ఫైల్‌ను ఇద్దరు రెండు సార్లు రెండు హోదాల్లో తిప్పుతూ డబుల్ ఇన్‌కమ్ పొందుతూ, ఫైల్ డబుల్ ప్రాసెస్ చేశారు. DTCP, GHMC లలో కూడా అర్వింద్ కుమార్‌తో కలసి ఫైల్స్ క్లియర్ చేసిన డైరెక్టర్ లు, CCP లపై విచారణలో ఈ వివరాలన్నీ వెల్లడయ్యాయి..