చెప్పొద్దు కానీ మగపుంగవుల్లో 90 శాతం మంది ఇంట్లో రామయ్యలు.. వీధుల్లో కృష్ణయ్యలే! పైకి జెంటిల్మన్గా పోజులు కొడుతూ చేయాల్సిందంతా చేసేస్తుంటారు. జనసందోహం ఉన్న చోట కావాలనే మహిళలకు తగులుతూ వెళుతుంటారు. అదో తుత్తి వారికి! పైగా తనను ఎవరూ చూడరనే ధీమా! పొరపాటున తగలి ఉంటాడులే అని మహిళలు అనుకుంటారనే ధైర్యం!
చెప్పొద్దు కానీ మగపుంగవుల్లో 90 శాతం మంది ఇంట్లో రామయ్యలు.. వీధుల్లో కృష్ణయ్యలే! పైకి జెంటిల్మన్గా పోజులు కొడుతూ చేయాల్సిందంతా చేసేస్తుంటారు. జనసందోహం ఉన్న చోట కావాలనే మహిళలకు తగులుతూ వెళుతుంటారు. అదో తుత్తి వారికి! పైగా తనను ఎవరూ చూడరనే ధీమా! పొరపాటున తగలి ఉంటాడులే అని మహిళలు అనుకుంటారనే ధైర్యం! ఒకవేళ పోకిరి చేష్టలను ఏ మహిళ అయినా పసిగడితే మాత్రం ఏమి తెలియనట్టు అమాయకంగా ఫేస్‌లు పెడుతుంటారు. ఇలాంటి చిత్తకార్తె మగవాళ్లను షీ టీమ్స్(she teams) గమనిస్తూనే ఉంటుంది. మొన్నటికి మొన్న ఇలాగే ఓ మగాడ్ని పట్టుకుని స్టేషన్‌కు తరలించారు పోలీసులు. తనకేమీ తెలియదని వాదించాడు. అయితే రేపు నీ భార్యను తీసుకుని కౌన్సిలింగ్‌కు రావాల్సిందిగా షీ టీమ్స్ సూచించడంతో గొప్పగా భార్యను వెంటేసుకుని వచ్చాడా భర్త. భార్యకు అతగాడు వేసిన పోకిరి వేషాలను టీ టీమ్స్ సిబ్బంది చూపించారు. అవన్నీ చూసిన భార్యకు దిమ్మదిరిగింది. అందరూ చూస్తుండగానే భర్త చెంప చెల్లుమనిపించింది. ఇతడొక్కడే కాదు, చాలా మంది షీ టీమ్స్‌కు దొరికిపోతున్నారు. వారి చేష్టలు చూసి కుటుంబసభ్యులు బిత్తరపోతున్నారు. తమ తండ్రి నిజస్వరూపం ఇదా అని పిల్లలు కోపగించుకుంటున్నారు. రద్దీ ఉన్న బస్సుల్లో, బస్టాపులలో, ఎగ్జిబిషన్ వంటి రద్దీ ప్రదేశాలలో షీ టీమ్స్ నిఘా పెంచింది. ఇలాంటి చెత్తగాళ్లను పట్టుకోవడం కోసమే ఆపరేషన్‌ను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా నిందితుల చేష్టలను వీడియోలు తీస్తుంది. పూర్తి సాక్ష్యాలు చేతికందిన తర్వాత ఆయా పోకిరీలను అదుపులోకి తీసుకుంటున్నారు. తర్వాత వారు చేసిన తప్పులను బట్టి కేసులు పెట్టడమో, కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేయడమో చేస్తున్నారు. పెళ్లయిన వారైతే భార్యలను కౌన్సిలింగ్‌కు పిలుపిస్తున్నారు. మొదట తన భర్త సుద్దపూస అని, శ్రీరామచంద్రుడిలాంటివాడని వాదిస్తుంటారు. షీ టీమ్స్ వీడియో చూపించిన తర్వాత భర్తలను అక్కడే పొట్టుపొట్టు కొడుతున్నారు. పెళ్లి కాని యువకులు దొరికితే తల్లిదండ్రులను పిలిపించి విషయం చెబుతున్నారు. ఇలాంటి వెధవ పనులు చేసేవారిలో మైనర్లు కూడా ఉండటం విషాదం!