పోలీసుల అరాచకం రోజురోజుకూ పేట్రేగిపోతుంది. పేదలు, దళితులంటే పోలీసులకు ఎప్పుడూ చులకనే.

పోలీసుల అరాచకం రోజురోజుకూ పేట్రేగిపోతుంది. పేదలు, దళితులంటే పోలీసులకు ఎప్పుడూ చులకనే. ఇదే స్థానంలో డబ్బున్న మహిళ ఉంటే థర్డ్‌ డిగ్రీ(3rd degree) ప్రయోగిస్తారా?. ఓ దళిత మహిళన అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆమెను చిత్ర హింసలు పెట్టారు. థర్డ్‌ డిగ్రీ ఉపయోగించి కదల్లేని స్థితికె నెట్టారు. దొంగతనం ఒప్పుకోవాలని కొడుకు ముందే వివస్త్రను చేసి నానారకాలుగా హింసిచారు. బంగారం దొంగతనం(Robbery) చేశారని తల్లి, కొడుకులను చిత్రహింసలకు గురిచేసిన ఘటన 10 రోజుల తర్వాత వెలుగులోకి వచ్చింది. చిత్రహింసలకు గురిచేయడంతో స్పృహతప్పిన మహిళకు దొంగతనం పోయిందని ఫిర్యాదు చేసిన వ్యక్తితో జండుబాం రాయించి అతని కారులోనే ఇంటికి తరలించారు. ఈ ఘటనపై ప్రభుత్వం సీరియసైంది. ఘటనపై దర్యాప్తు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఇన్‌స్పెక్టర్‌ రాంరెడ్డిని హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేశారు.

షాద్‌నగర్‌(shadnagar) అంబేద్కర్‌ నగర్‌లో(ambedkar Nagar) రెండువారాల క్రితం దొంగతనం జరిగింది. 24 తులాల బంగారం, రూ.2 లక్షల డబ్బు పోయిందని నాగేందర్‌ అనే వ్యక్తి జులై 24న పోలీసులకు ఫిర్యాదు చేసి పక్కింటివారిపై అనుమానం ఉందని తెలిపాడు. దీంతో డీఐ రాంరెడ్డి విచారణ చేసి భీమయ్య కుటుంబాన్ని అదుపులోకి తీసుకున్నారు. తొలుత భీమయ్య, అతని భార్య సునీతను(sunitha) అదుపులోకి తీసుకున్న పోలీసులు భీమయ్యను వదిలేసి కొడుకును తీసుకెళ్లారు. 13 ఏళ్ల జగదీష్‌ను, తల్లిని విచారించారు. అంతేకాదు ఇద్దరిపై థర్డ్‌ డిగ్రీని ఉపయోగించారు. తన కొడుకు ముందే తనను వివస్త్ర చేసి కాళ్ల మధ్యన కట్టెలు పెట్టి బూటు కాళ్లతో తొక్కుతూ హింసించారని తెలిపింది. అలాగే తన కొడుకు జగదీష్‌ను కూడా హింసించారని రబ్బరు బెల్ట్‌తో తన అరికాళ్లపై ఒకరితర్వాత ఒకరు మార్చిమార్చి కొట్టారని బాధితురాలు ఆరోపించింది. తాను మూర్చపోవడంతో ఏదైనా జరిగితే ఇబ్బందులు వస్తాయని తమపై ఫిర్యాదు చేసిన వ్యక్తి కారులోనే ఇంటికి పంపిచారని తెలిపింది. అయితే భీమయ్య ఇంటి ముందే కొంత బంగారం దొరికిందని అందుకే వీరి కుటుంబాన్ని అదుపులోకి తీసకున్నామని పోలీసులు కవరింగ్ చేసే ప్రయత్నం చేశారు. పది రోజులుగా విచారించినా దొంగతనం చేసినట్లు ఒప్పుకోలేదని, ఒకవేళ నేరాన్ని అంగీకరిస్తే ఎందుకు రిమాండ్‌కు పంపించలేదని ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం బయటకు రావడంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. కేసు విచారించిన డీఐ రాంరెడ్డిని హెడ్‌ క్వార్టర్స్‌కు అటాచ్‌ చేశారు.

మరోవైపు ఈ కేసుకు రాజకీయరంగు పులుముకుంది. ఘటనపై కేటీఆర్‌ ట్విట్టర్‌లో తీవ్రవిమర్శలు చేశారు. దళిత మహిళపై ఇంత దాష్టీకమా అని ప్రశ్నించారు. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం, ఇదేనా ప్రజాపాలనా అని ట్వీట్ చేశారు. దొంగతనం ఒప్పుకోవాలంటూ థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా? మహిళా అని కూడా చూడకుండా ఇంత అమానవీయంగా ప్రవర్తిస్తారా? రక్షించాల్సిన పోలీసులతోనే రక్షణ లేని పరిస్థితా? ముఖ్యమంత్రే స్వయంగా ఆడబిడ్డలను అవమానిస్తుంటే పోలీసులు మాత్రం మేమేమీ తక్కువ అన్నట్లు వ్యవహరిస్తున్నారుని కేటీఆర్ రాసుకొచ్చారు. వెంటనే ఈ దాడికి పాల్పడిన పోలీసులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి, బాధిత మహిళలకు న్యాయం చేయాలని కేటీఆర్‌ డిమాండ్ చేశారు. దళిత వ్యతిరేక.. మహిళా వ్యతిరేక కాంగ్రెస్ సర్కారును తెలంగాణ సమాజం ఎప్పటికీ క్షమించదని కేటీఆర్ ట్వీట్ చేశారు.

Eha Tv

Eha Tv

Next Story