Congress Veerlapally Shankar : గిదేంది శంకర్ ...ఏం చేశారో మీకు అర్థమవుతోందా?
షాద్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి(Shadnagar Constituency) చెందిన కాంగ్రెస్(Congress) పార్టీ అభ్యర్థి వీర్లపల్లి శంకర్(Veerlapally Shankar) ఒక కుటుంబానికి ఆర్ధిక సాయం చేశారు. చేసిన ఆ సాయాన్ని సోషల్ మీడియాలో(Social media) ప్రచారం చేసుకుంటున్నారు.
షాద్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి(Shadnagar Constituency) చెందిన కాంగ్రెస్(Congress) పార్టీ అభ్యర్థి వీర్లపల్లి శంకర్(Veerlapally Shankar) ఒక కుటుంబానికి ఆర్ధిక సాయం చేశారు. చేసిన ఆ సాయాన్ని సోషల్ మీడియాలో(Social media) ప్రచారం చేసుకుంటున్నారు. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఆర్ధిక సాయాలు, నగదు పంపిణీ చేయడం కోడ్ ఆఫ్ కండక్ట్(Code Of Conduct) కిందకు వస్తుంది. డబ్బులు పంచడం ఎన్నికల నియామావళికి అది విరుద్ధం కాబట్టి ఎవరూ చేయకూడదు. షాద్‌నగర్ నియోజకవర్గం కొందుర్గు మండలం పర్వతాపూర్ గ్రామంలో కోమటి లక్ష్మయ్య(Komti Lakshmaiah ) అనారోగ్యంతో చనిపోవడంతో ఈ విషయం తెలుసుకున్న వీర్లపల్లి శంకర్ ఆ గ్రామానికి వెళ్లి కుటుంబసభ్యులను పరామర్శించి తక్షణ సాయంగా 15 వేల రూపాయలు అందచేశారు.
కుటుంబసభ్యులకు అన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు. ఎవరైనా చనిపోతే రాజకీయ నాయకులు ఆర్ధిక సాయం చేయడమన్నది సర్వసాధారణం. ఎన్నికల వేళ ఇలాంటివి చేస్తేనే అభ్యంతరాలు వస్తుంటాయి. ఎన్నికల కమిషన్(Election Commission) ఇలాంటి వాటిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఉంటుంది. ఇప్పుడు వీర్లపల్లి శంకర్ చేసిన ఆర్ధిక సాయంపై అభ్యంతరాలు ఏమిటంటే, కోమటి లక్ష్మయ్య మృతదేహం అక్కడ ఉంది. పక్కనే కుటుంబసభ్యులు ఉన్నారు.
ఓ పది మంది కార్యకర్తలు ఉన్నారు. శంకర్ 15 వేల రూపాయలను శవంపై నుంచి కుటుంబసభ్యులకు అందించారు. పక్కనుంచి ఓ ఫోటో తీశారు. ఆ ఫోటోకు బార్డర్‌లో మంచి డిజైన్ వేశారు. కింద వీర్లపల్లి శంకర్ ఆర్ధికసాయం చేశారంటూ రాశారు. దీన్ని ప్రచారం చేస్తున్నారు. చూసిన వాళ్లకు ఇది నీచత్వమన్న భావన కలిగితీరుతుంది. ఎన్నికల వేళ ఓట్ల కోసం ఇంత నీచానికి దిగజారాలా? శవంపై నుంచి డబ్బులు ఇస్తున్న ఫోటోను, మృతుడి కుటుంబసభ్యుల ఫోటోను, శంకర్ ఫోటోను ఎన్నికల ప్రచారానికి ఉపయోగించుకుంటారా? 15 వేల రూపాయల ఆర్ధికసాయం చేయడం మంచిదే కావచ్చు. చేయండి ఎవరూ కాదనరు.
కాకపోతే దాన్ని ఎన్నికల ప్రచారానికి వాడుకోవాల్సినంత ఖర్మ ఏమిటి? శవంపై నుంచి డబ్బులు ఇస్తున్న దృశ్యాన్ని వైరల్ చేస్తూ ఓట్లు అడుక్కుంటారా? పార్టీకి సంబంధించిన వర్కర్లంతా అదేదో పెద్ద ఘనకార్యంలా ఫీలవుతూ, శంకర్ గొప్ప పని చేశారంటూ కితాబిస్తూ ప్రచారం చేస్తారా?15 వేల రూపాయలు సాయం చేసి, మొత్తం కుటుంబాన్నే ఆదుకుంటున్నట్టుగా బిల్డప్ ఇస్తారా? మీ రాజకీయాల కోసం శవాలను కూడా వాడుకుంటారా? ఇవి శవ రాజకీయాలు కావా? పేదలకు ఆర్ధికసాయం చేయడం మంచిదే! చేసిన సాయాన్ని పది మందికి చెప్పుకోకుండా గుప్తంగా ఇవ్వవచ్చు కదా! ఆ కుటుంబం బాగుండాలన్నదే మీ కోరిక అయినప్పుడు గుట్టుగా ఆర్ధిక సాయం చేయవచ్చు.
పోనీ కుటుంబసభ్యులకు డబ్బు అందిస్తూ, దాన్ని ఫోటో తీసుకుని ప్రచారం చేసుకోండి.. ఎవరూ అభ్యంతర పెట్టరు. కానీ శవంపై నుంచి డబ్బులు ఇస్తున్నట్టుగా ఫోటో పెట్టుకుని ప్రచారం చేసుకోవడమేమిటి? ఎందుకింతగా దిగజారిపోతున్నారు? ఎన్నికల సంఘం ఏం చేస్తున్నట్టు? ఓ నిరుపేద కుటుంబాన్ని ఆదుకోవడం కూడా తప్పేనా? ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి సాయాన్ని ఆపుతారా? అని కొందరికి కోపం రావచ్చు. ఈ వ్యవహారాన్ని ఎన్నికల కమిషన్ కూడా దీన్ని విస్మరించవచ్చు. కానీ ప్రచారం కోసం శవరాజకీయం చేయడమే దుర్మార్గం అనిపించుకుంటోంది. వారి మానసికస్థితి ఎలా ఉందో అర్థమవుతోంది. బుద్ధి తెచ్చుకుని ఇప్పటికైనా ఇలాంటివి ఆపండి. ఎవరైనా, ఏ పార్టీ వారైనా ఇలాంటివి మానేయండి. ఆ కుటుంబం ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినట్టు కాదా ఇది? ఎలెక్షన్ కమిషన్ అధికారులు ఏం చేస్తున్నట్టు? ఇలాంటి ప్రచారాలపైన ఎందుకు చర్య తీసుకోరు? అధికార బీఆర్‌ఎస్(BRS) పార్టీ ఏం చేస్తున్నట్టు? భారతీయ జనతాపార్టీ(BJP) ఏం చేస్తోంది? ఇలాంటి ప్రచారాలను ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలి కదా! మరి ఆ పార్టీలు ఎందుకు స్పందిచడం లేదు? ఇదేదో బాగుందనుకుని, ఇలాగే తాము కూడా ప్రచారం చేయాలని ఆ పార్టీలు అనుకుంటున్నాయా?
చేసింది తప్పని మీకు అనిపిస్తే సోషల్ మీడియా నుంచి ఆ ఫోటోలను వెంటనే తొలగించండి శంకర్, ఆ కుటుంబానికి క్షమాపణ చెప్పుకోండి.!