ప్రధానమంత్రి నరేంద్రమోదీ(PM Modi) ఇవాళ తెలంగాణ పర్యటనకు రానున్న నేపథ్యంలో శనివారం పలువురు తెలంగాణ కాంగ్రెస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (NSUI) అధ్యక్షుడు బలమూరి వెంకట్(Balmoori Venkat), యూత్ కాంగ్రెస్(Youth Congress) అధ్యక్షుడు శివసేనారెడ్డి(Shivasena Reddy), దళిత కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రీతమ్, మహిళ కాంగ్రెస్(Womens Congress) అధ్యక్షురాలు సునీతా రావ్(Sunitha Rao), హైదరాబాద్ యూత్ కాంగ్రెస్ ప్రెపిడెంట్ మోత రోహిత్ తదితరులను అదుపులోకి తీసుకున్నారు. ప్రధాని మోదీ నేడు […]

Several Telangana Congress leaders detained ahead of PM Modi’s visit to Hyderabad
ప్రధానమంత్రి నరేంద్రమోదీ(PM Modi) ఇవాళ తెలంగాణ పర్యటనకు రానున్న నేపథ్యంలో శనివారం పలువురు తెలంగాణ కాంగ్రెస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (NSUI) అధ్యక్షుడు బలమూరి వెంకట్(Balmoori Venkat), యూత్ కాంగ్రెస్(Youth Congress) అధ్యక్షుడు శివసేనారెడ్డి(Shivasena Reddy), దళిత కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రీతమ్, మహిళ కాంగ్రెస్(Womens Congress) అధ్యక్షురాలు సునీతా రావ్(Sunitha Rao), హైదరాబాద్ యూత్ కాంగ్రెస్ ప్రెపిడెంట్ మోత రోహిత్ తదితరులను అదుపులోకి తీసుకున్నారు.
ప్రధాని మోదీ నేడు సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ ఎక్స్‌ప్రెస్(Vande Bharat Express)ను ప్రారంభించనున్నారు. అలాగే.. తెలంగాణ(Telangana) లో రూ.11,300 కోట్ల రూపాయలకు పైగా విలువైన ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల నిమిత్తం ప్రధాని నరేంద్ర మోదీ శనివారం హైదరాబాద్‌కు రానున్నారు. పర్యటనలో భాగంగా సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో జరిగే బహిరంగ సభలో కూడా ప్రధాని పాల్గొంటారని అధికారిక వర్గాలు తెలిపాయి. ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో నగరంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విదించారు.
ఎయిమ్స్ బీబీనగర్, ఐదు జాతీయ రహదారుల ప్రాజెక్టులకు ప్రధాని మోదీ(Prime Minister Narendra Modi) శంకుస్థాపన చేస్తారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధికి శంకుస్థాపన చేయడంతో పాటు.. రైల్వేకు సంబంధించిన ఇతర అభివృద్ధి కార్యక్రమాలను జాతికి అంకితం చేయనున్నారు. సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ రైలు రెండు నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని దాదాపు మూడున్నర గంటలు తగ్గిస్తుంది. హైదరాబాద్ పర్యటన అనంతరం ప్రధాని మోదీ తమిళనాడుకు వెళ్లనున్నారు.
