తెలంగాణ(Telangana) వ్యాప్తంగా గత వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వర్షాల కారణంగా ములుగు జిల్లా జంపన్నవాగుకు(Jampanna river) వరద పోటెత్తింది. వరద ఉదృతికి కొండాయి, మల్యాల గ్రామాలు నీట మునిగాయి.

7 People Missing In Jampanna river
తెలంగాణ(Telangana) వ్యాప్తంగా గత వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వర్షాల కారణంగా ములుగు జిల్లా జంపన్నవాగుకు(Jampanna river) వరద పోటెత్తింది. వరద ఉదృతికి కొండాయి, మల్యాల గ్రామాలు నీట మునిగాయి. ఈ వరదలలో ఏడుగురు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, రెస్క్యూ సిబ్బంది వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన వారిలో నలుగురి మృతదేహాలు లభ్యమవగా.. మరో ముగ్గురి కోసం హెలికాఫ్టర్ సాయంతో గాలిస్తున్నారు. వరదల కారణంగా అత్యవసరం అయితే తప్ప ఎవరూ బయటకు రావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.
