ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టు సీహెచ్‌వీఎం కృష్ణారావు( Krishna Rao)కన్నుమూశారు. గతకొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం కన్నుమూశారు. బాబాయ్‌గా రాజకీయ వర్గాల్లో పేరు పొందిన ఆయన.. దాదాపు నాలుగు దశాబ్దాలు పత్రికా రంగంలో అనేక సంస్థల్లో పనిచేశారు.

Senior Journalist Krishna Rao
ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టు సీహెచ్‌వీఎం కృష్ణారావు( Krishna Rao)కన్నుమూశారు. గతకొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం కన్నుమూశారు. బాబాయ్‌గా రాజకీయ వర్గాల్లో పేరు పొందిన ఆయన.. దాదాపు నాలుగు దశాబ్దాలు పత్రికా రంగంలో అనేక సంస్థల్లో పనిచేశారు. కృష్ణారావు ప్రయాణం 1975లో స్టింగర్‌గా ప్రారంభమైంది. ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎదిగిన ఆయన.. ఈనాడు, ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి, డెక్కన్ క్రానికల్, ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ సంస్థలలో పనిచేశారు.
గత ఏడాది కృష్ణారావు క్యాన్సర్ బారిన పడ్డారు. ఆయనకు భార్య, కొడుకు, కుమార్తె, ఇద్దరు మనవరాళ్లు ఉన్నారు. కృష్ణారావు మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్(KCR), టీపీసీసీ అద్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth reddy) సంతాపం ప్రకటించారు. అలాగే ఆయన మరణవార్త తెలిసిన రాజకీయ ప్రముఖులు, పలు మీడియా సంస్థలు సంతాపం తెలుపుతున్నాయి.
సీనియర్ జర్నలిస్ట్ నాకు మంచి మిత్రుడు
CH.V.M. కృష్ణా రావు గారి మరణవార్త అత్యంత బాధను కలిగించింది . భగవంతుడు వారి ఆత్మకు శాంతిని చేకూర్చి, వారి కుటుంబానికి శక్తిని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. pic.twitter.com/JGcHoLralI— Dr. N Raghuveera Reddy (@drnraghuveera) August 17, 2023
