స్మితా సబర్వాల్(Smitha sarbharwal).. నాలుగైదు రోజుల నుంచి ట్రెండ్ అవుతున్న పేరు. కేసీఆర్(KCR) ప్రభుత్వంలో స్మితా సబర్వాల్ సీఎంఓలో కీలక అధికారిణిగా విధులు నిర్వర్తించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం పడిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. రేవంత్‌రెడ్డి(Revanth Reddy) ముఖ్యమంత్రి అయ్యారు. కొత్త సీఎంను చాలా మంది ఐఏఎస్, ఐపీఎస్, ఇతర ఉన్నతాధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు.

Smitha Sabharwal
స్మితా సబర్వాల్(Smitha sarbharwal).. నాలుగైదు రోజుల నుంచి ట్రెండ్ అవుతున్న పేరు. కేసీఆర్(KCR) ప్రభుత్వంలో స్మితా సబర్వాల్ సీఎంఓలో కీలక అధికారిణిగా విధులు నిర్వర్తించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం పడిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. రేవంత్‌రెడ్డి(Revanth Reddy) ముఖ్యమంత్రి అయ్యారు. కొత్త సీఎంను చాలా మంది ఐఏఎస్, ఐపీఎస్, ఇతర ఉన్నతాధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు. స్మితా సబర్వాల్ మాత్రం ఇప్పటి వరకు ఆయనను కలవలేదు. ఇదే హాట్ టాపిక్‌గా మారింది. పైగా డిప్యూటేషన్‌పై ఆమె కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తారనే ప్రచారం కూడా జరిగింది. ఇవాళ స్మితా సబర్వాల్ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా సంక్షేమశాఖ మంత్రి సీతక్కను(seethakka) కలిశారు. కొన్ని ఫైళ్లపై మంత్రితో ఆమె సంతకాలు తీసుకున్నారు. తాను కేంద్ర సర్వీసులోకి వెళుతున్నానన్నది పచ్చి అబద్ధమని చెప్పారు స్మితా సబర్వాల్. తెలంగాణ అధికారిణిగా ఇక్కడే పని చేస్తానని స్పష్టం చేశారు. ఈ రాష్ట్ర ప్రయాణంలో భాగమైనందుకు గర్విస్తున్నట్టు ఆమె ట్విటర్ (ఎక్స్)లో తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం తనకు ఏ బాధ్యత ఇచ్చినా నిర్వర్తిస్తానన్నాను. ఈ నేపథ్యంలోనే సీతక్కను స్మిత కలవడంతో మళ్లీ స్మితా వార్తల్లోకి వచ్చారు. తర్వలో ఆమె ముఖ్యమంత్రి రేవంత్‌ను కూడా కలుస్తారని సమాచారం.
