ఆదివారం ఉదయం సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహంకాళి బోనాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారికి తొలి పూజలు చేసిన తర్వాత.. ఉదయం 3.30 గంటలకు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలతోపాటు బోనం సమర్పించారు.

ఆదివారం ఉదయం సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహంకాళి బోనాలు(Secunderabad Ujjaini Mahankali Bonalu) అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారికి తొలి పూజలు చేసిన తర్వాత.. ఉదయం 3.30 గంటలకు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌(Minister Talasani Srinivas Yadav) ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలతోపాటు బోనం సమర్పించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. తెల్లవారుజాము నుంచే అమ్మవారి ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు క్యూ కట్టారు. మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తులు పెద్దసంఖ్యలో అమ్మవారికి మొక్కులు చెల్లించుకునేందుకు తరలిరానుండటంతో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వం ఆలయం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

Updated On 8 July 2023 11:31 PM GMT
Yagnik

Yagnik

Next Story