తెలంగాణ రాజకీయాలలో తీవ్ర విషాదం నెలకొంది. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. 33 ఏళ్ల లాస్య నందిత శుక్రవారం తెల్లవారుజామున పటాన్‌చెరు ఓఆర్ఆర్‌(Patancheruvu ORR) దగ్గర ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి ప్రమాదానికి(Car Accident) గురయ్యింది. ఈ ఘటనలో లాస్య నందిత అక్కడికక్కడే చనిపోయారు. కారు నడిపిన ఆమె పీఏ ఆకాశ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

తెలంగాణ రాజకీయాలలో తీవ్ర విషాదం నెలకొంది. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. 33 ఏళ్ల లాస్య నందిత శుక్రవారం తెల్లవారుజామున పటాన్‌చెరు ఓఆర్ఆర్‌(Patancheruvu ORR) దగ్గర ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి ప్రమాదానికి(Car Accident) గురయ్యింది. ఈ ఘటనలో లాస్య నందిత అక్కడికక్కడే చనిపోయారు. కారు నడిపిన ఆమె పీఏ ఆకాశ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ సుల్తాన్‌పూర్‌ ఓఆర్‌ఆర్‌ వద్ద ఈ తెల్లవారు ఝామున దుర్ఘటన చోటు చేసుకుంది. సదాశివపేటలో ఓ ప్రైవేట్‌ కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తుండగా వాహనం ప్రమాదానికి గురయ్యింది. డ్రైవర్‌ సీట్‌లో ఉన్న వ్యక్తి నిద్రమత్తు, వాహన అతివేగం ప్రమాదానికి కారణాలైన ఉంటాయని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ముందు వెళ్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో సడన్‌ బ్రేక్‌ వేయడంతో కారు అదుపు తప్పి.. రెయిలింగ్‌ను బలంగా ఢీ కొట్టడంతోనే ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. ఆ సమయంలో లాస్య సీటు బెల్ట్‌ పెట్టుకోకపోవడం వల్ల అక్కడికక్కడే మృతి చెందారు. ఆమె ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత వరుస ప్రమాదాలు చోటు చేసుకున్నాయి.

పది రోజుల కిందట నల్లగొండ దగ్గర రోడ్డు ప్రమాదంలో స్వల్ప గాయలతో బయటపడ్డారు లాస్య. నల్లగొండలో బీఆర్‌ఎస్‌ బహిరంగసభకు హాజరై తిరిగి వస్తుండగా నార్కట్‌పల్లి సమీపంలోని చెర్లపల్లి వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారును ఆటో ఢీకొట్టింది. ఇంతలోనే మరో రోడ్డు ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయారు.అంతకు ముందు లిఫ్ట్‌లోనూ ఇరుక్కున్నారు. కంటోన్మెంట్ మాజీ ఎమ్మెల్యే, దివంగత సాయన్న కూతురే లాస్య నందిత. తండ్రి మరణంతో కూతురుకు టికెట్ ఇచ్చింది బీఆర్‌ఎస్‌.

ఇటీవలి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గణేశ్‌పై 17 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు లాస్య. 1987లో హైదరాబాద్‌లో జన్మించారు. కంప్యూటర్‌ సైన్స్‌లో బీటెక్‌ పూర్తిచేశారు. అనంతరం 2015లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. అదేఏడాది జరిగిన కంటోన్మెంట్‌ బోర్డు ఎన్నికల్లో ఆమె ఓడిపోయారు. 2016లో తన తండ్రి, అప్పటి ఎమ్మెల్యే సాయన్నతోపాటు బీఆర్‌ఎస్‌లో చేరారు. 2016-20 మధ్య కవాడిగూడ కార్పొరేటర్‌గా పనిచేశారు. 2021లో జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కవాడిగూడ నుంచి పోటీచేసి ఓటమి చవిచూశారు.

హైదరాబాద్ ఓఆర్ఆర్(Hyderabad Orr) పై కారు ప్రమాదంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత(MLA Lasya Nanditha) మరణించింది. లాస్య మరణవార్త విన్న ఆమె కుటుంబ సభ్యులు బోరున విలపించారు. లాస్య తల్లి కూతురు మరణాన్ని తట్టుకోలేక స్పృహతప్పి పడిపోయారు. 2023 ఫిబ్రవరి 19న లాస్య నందిత తండ్రి.. దివంగత కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న గుండెపోటుతో మృతిచెందారు. ఆ తర్వాత కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా లాస్య నందిత ఎన్నికయ్యారు. తండ్రి మరణించని ఏడాదిలో లోపు లాస్య నందిత మృతిచెందడంతో ఆమె కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు నెలకొన్నాయి.

ఎమ్మెల్యే లాస్య నందిత మరణం పట్ల మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) సంతాపం తెలిపారు. అతిపిన్న వయసులో ఎమ్మెల్యేగా ప్రజామన్ననలు పొందిన ఆమె.. రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందడం ఎంతో బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. కష్టకాలంలో వారి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా వుంటుందన్నారు. శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

మాజీ మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. "లాస్య ఇక లేరు అనే అత్యంత విషాదకరమైన షాకింగ్ న్యూస్ ఇప్పుడే విన్నాను. మంచి యువ ఎమ్మెల్యే మరణించారనే విషాదకర వార్త లేవగానే విన్నాను. ఈ వార్త ఎంతో బాధించింది. ఈ క్లిష్ట సమయంలో ఆమె కుటుంబం, స్నేహితులకు భగవంతుడు మనోధైర్యం ఇవ్వాలని, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా" అని అన్నారు.

Updated On 23 Feb 2024 12:41 AM GMT
Yagnik

Yagnik

Next Story