తెలంగాణలో అమలవుతున్న మహాలక్ష్మీ పథకం కారణంగా ఆర్టీసీలో ప్రయాణించే వారి సంఖ్య

తెలంగాణలో అమలవుతున్న మహాలక్ష్మీ పథకం కారణంగా ఆర్టీసీలో ప్రయాణించే వారి సంఖ్య గణనీయంగా పెరిగిన సంగతి తెలిసిందే. అంత మంది బస్సుల్లో ఉండడంతో టిక్కెట్లు జారీ చేయడం కూడా కండక్టర్లు చాలా కష్టంగా మారింది.ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ బస్సులో సీట్ల అమరికకు కొన్ని మార్పులు చేస్తున్నారు. మెట్రో రైళ్లల్లో మాదిరిగా బస్సుల్లోనూ సిట్లను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా బస్సు మధ్యలో ఉన్న ఆరు సీట్లను తొలగించి, అదే స్థానంలో బస్సు వాల్స్‌కు సమాంతరంగా సీట్లు ఏర్పాటు చేశారు. ప్రయోగాత్మకంగా కొన్ని రూట్లలో ఆర్టీసీ ఈ బస్సులను తీసుకుని వచ్చారు. ఒకప్పుడు రోజుకు 11 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తే ప్రస్తుతం ఈ సంఖ్య ఏకంగా 18 - 20 లక్షలకు చేరింది. ఉదయం, సాయంత్రం వేళల్లో బస్సులు కిక్కిరిసిపోతున్నాయని అధికారులు తెలిపారు. బస్సుల్లో ప్రతి ఒక్కరికీ జీరో టిక్కెట్ జారీ చేయాలన్న నిబంధన అమలవుతుండటంతో కండక్టర్లకు ఇబ్బందిగా మారింది. ఈ సమస్యకు తక్షణ పరిష్కారంగా ఆర్టీసీ సీట్ల అమరికలో మార్పు చేస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో 44 సీట్లుంటాయి. 63 మంది ప్రయాణిస్తే బస్సు ఆక్యుపెన్సీ రేషియో 100 శాతానికి చేరినట్టు భావిస్తారు. అంతకంటే ఎక్కువగానే బస్సుల్లో జనం ప్రయాణిస్తూ ఉన్నారు. కొన్ని స్టాపింగ్స్ లో బస్సులు ఎక్కడానికి కూడా ఇతరులు ఇబ్బంది పడుతూ ఉన్నారు.

ఆర్టీసీని ఆర్థికంగా బలోపేతం చేసేందుకే ప్రభుత్వం మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని తీసుకొచ్చిందని సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల తెలిపారు. మహాలక్ష్మి పథకం కింద 60 రోజుల్లో 15.21 కోట్ల మంది మహిళల ఉచిత ప్రయాణానికి చెందిన రూ.535 కోట్ల చెక్కును మహిళలతో కలిసి ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌కు సీఎం రేవంత్‌రెడ్డి అందజేశారు.

Updated On 14 Feb 2024 10:41 PM GMT
Yagnik

Yagnik

Next Story