తెలంగాణలో పాఠశాలల పునఃప్రారంభానికి కౌంట్‌డౌన్ ప్రారంభం అయింది. జూన్ 12వ తేదీ సోమవారం రోజు నుంచి స్కూళ్లు రీ ఓపెన్ కానున్నాయి. వేసవి సెలవులు ముగుస్తుండటంతో విద్యార్థులు ఊళ్ల నుంచి పట్టణాలకు చేరకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం స్కూళ్లకు ఏప్రిల్ 25 నుంచి వేసవి సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించింది.

Schools to resume in Telangana from June 12
తెలంగాణ(Telangana)లో పాఠశాలల పునఃప్రారంభాని(Schools Reopen)కి కౌంట్‌డౌన్ ప్రారంభం అయింది. జూన్ 12వ తేదీ సోమవారం రోజు నుంచి స్కూళ్లు రీ ఓపెన్ కానున్నాయి. వేసవి సెలవులు(Summer Holidays) ముగుస్తుండటంతో విద్యార్థులు ఊళ్ల నుంచి పట్టణాలకు చేరకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) స్కూళ్లకు ఏప్రిల్ 25 నుంచి వేసవి సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించింది. ఇదిలావుంటే.. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE)కి అనుబంధంగా ఉన్న పాఠశాలలు ఇప్పటికే మార్చి, ఏప్రిల్ నెలల్లో 2023-24 విద్యా సంవత్సరాన్ని ప్రారంభించగా.. రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని పాఠశాలలు.. జూన్ 12 నుండి విద్యా సంవత్సరాన్ని(Academic Year) ప్రారంభించనున్నాయి. ఈ క్రమంలోనే జూన్ 1 నుండి 9 వరకు ప్రభుత్వ పాఠశాలల్లో బడి బాట(Badi Bata) నిర్వహించాలని విద్యా శాఖ(Education Department) యోచిస్తోంది. ఇందులో భాగంగా ఉపాధ్యాయులు(Teachers) ఇంటింటికీ ప్రచారం నిర్వహించి బడి మానేసిన పిల్లలను గుర్తించి వారి వయస్సు ప్రకారం తగిన తరగతిలో బడిలో చేర్పిస్తారు.
