నిన్న‌టితో వేసవి సెలవులు ముగిశాయి. దీంతో నెలన్నర విరామం తర్వాత బడిగంటలు మోగనున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 41 వేల స్కూళ్లు.. నేటి నుంచి తిరిగి తెరుచుకోనున్నాయి. దీంతో దాదాపు 60 లక్షల మంది విద్యార్థులు తిరిగి బడిబాటపట్టనున్నారు. సెలవులను ఆట పాటలతో గడిపిన చిన్నారులు.. సోమవారం నుంచి చదువుల ప్రపంచంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ క్ర‌మంలో పాఠశాల విద్యాశాఖ స‌ర్వం సిద్ధం చేసింది.

నిన్న‌టితో వేసవి సెలవులు(Summar Holidays) ముగిశాయి. దీంతో నెలన్నర విరామం తర్వాత తెలంగాణ‌(Telangana)లో బడిగంటలు(Schools Reopen) మోగనున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 41 వేల స్కూళ్లు.. నేటి నుంచి తిరిగి తెరుచుకోనున్నాయి. దీంతో దాదాపు 60 లక్షల మంది విద్యార్థులు తిరిగి బడిబాటపట్టనున్నారు. సెలవులను ఆట పాటలతో గడిపిన చిన్నారులు.. సోమవారం(Monday) నుంచి చదువుల ప్రపంచంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ క్ర‌మంలో పాఠశాల విద్యాశాఖ(Education Department) స‌ర్వం సిద్ధం చేసింది.

అయితే ఎండ‌లు మండుతున్న(Heat Wave) నేప‌థ్యంలో పాఠశాలల సెలవులను 19వ తేదీ వరకు పొడిగించారని వస్తున్న వార్తలు అవాస్తవమని, సెలవులను ప్రభుత్వం పొడిగించలేదని విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ(Vaakati Karuna) స్పష్టం చేశారు. సెలవులు పొడించారంటూ సోషల్‌మీడియా(Social Media)లో చక్కర్లు కొడుతున్న సర్క్యూలర్‌ ఫేక్‌ అని ఆదివారం(Sunday) విడుదల చేసిన ప్రకటనలో ఆమె స్పష్టం చేశారు. రేపటి నుంచే బడులు పునఃప్రారంభమవుతాయని తెలిపారు.

ఇదిలావుంటే.. ఏపీ(Andhra Pradesh)లో ఈ రోజు నుంచి వారం పాటు ఒంటి పూట బడులు(Half Day Schools) నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత కొన్ని రోజులుగా ఏపీ వ్యాప్తంగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు(Temparatures), వేడిగాలుల(Heatwaves) దృష్ట్యా ఒంటి పూట బడులు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి విద్యా కానుక(Vidya Kanuka) అందించనున్నారు. ఈ నెల 17వ తేదీ వరకు ఒక్క పూట బడులు నిర్వ‌హించాల‌ని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉదయం 7.30 గంటల నుంచి 11:30 గంటల వరకు మాత్రమే తరగతులు నిర్వహించాలని ఆదేశాలిచ్చింది. రాగి జావ(Ragi Java) ఉదయం 8:30 నుండి 9:00 లోగా అందించాలని.. మధ్యాహ్న భోజనం(Midday Meals) మధ్యాహ్నం 11:30 నుండి 12:00 వరకు ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది.

Updated On 11 Jun 2023 9:30 PM GMT
Yagnik

Yagnik

Next Story