అక్టోబర్‌లో హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని(Telangana) ఇతర జిల్లాల్లోని పాఠశాలలకు 16 సెలవులు రానున్నాయి.

అక్టోబర్‌లో హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని(Telangana) ఇతర జిల్లాల్లోని పాఠశాలలకు 16 సెలవులు రానున్నాయి. వీటిలో దసరా(Dasara), దీపావళి(Depawali) పండుగలకు సెలవులు(Holidays) కూడా ఉన్నాయి. పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం.. దసరా సెలవులు 13 రోజులు ఉన్నాయి. అక్టోబరు 2న సెలవులు ప్రారంభమవుతాయి.. అక్టోబర్ 15న పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి.

దసరా సెలవులు కాకుండా.. అక్టోబర్ 31న దీపావళి పండుగ ఉంది. ఈ పండుగ‌కు కూడా హైదరాబాద్, తెలంగాణలోని ఇతర జిల్లాలలో పాఠశాలలు కూడా మూత‌ప‌డ‌నున్నాయి. దసరా, దీపావళి పండుగల కారణంగా మొత్తం 14 రోజుల పాటు పాఠశాలలు మూత‌ప‌డుతాయి. అలాగే 20, 27 తేదీల‌లో ఆదివారాలు రానున్నాయి. ఈ కార‌ణంగా కూడా పాఠ‌శాల‌ల‌కు రెండు రోజులు సెల‌వులు రానున్నాయి. దీంతో అక్టోబర్ మాసంలో 16 రోజులు స్కూళ్లు మూత‌ప‌డ‌నున్నాయి.

Eha Tv

Eha Tv

Next Story