ముఖ్యమంత్రి కేసీఆర్ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం ఉదయం 9 గంటల 40 నిమిషాలకు ప్రగతిభవన్‌లో జాతీయ జెండాను ఎగరవేస్తారు. అనంతరం 9 గంటల 50 నిమిషాలకు ప్రగతిభవన్ నుండి పరేడ్ గ్రౌండ్ కు వెళ్తారు.

Schedule of programs in which CM KCR will participate on the occasion of Independence Day
ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) స్వాతంత్ర దినోత్సవం(Independence Day) సందర్భంగా మంగళవారం ఉదయం 9 గంటల 40 నిమిషాలకు ప్రగతిభవన్(Pragathi Bhavan)లో జాతీయ జెండా(National Flag)ను ఎగరవేస్తారు. అనంతరం 9 గంటల 50 నిమిషాలకు ప్రగతిభవన్ నుండి పరేడ్ గ్రౌండ్(Parade Ground) కు వెళ్తారు. 10 గంటలకు పరేడ్ గ్రౌండ్ లోని వీరుల సైనిక్ స్మారక చిహ్నం వద్ద నివాళులు అర్పిస్తారు. 10 గంటల 15 నిమిషాలకు పరేడ్ గ్రౌండ్ నుండి బయలుదేరి 10: 45 నిమిషాలకు గోల్కొండ కోట(Golkonda Port)కు చేరుకుంటారు. అక్కడ 10.50 నిమిషాలకు పోలీస్ గార్డ్స్ సీఎం కేసీఆర్ కు స్వాగతం పలుకుతారు. అనంతరం సీఎం కేసీఆర్ 11 గంటలకు జాతీయ పతాకావిష్కరణ చేస్తారు. 11.15 నిమిషాలకు రాష్ట్ర ప్రగతిపై సీఎం కేసీఆర్ ప్రసంగం చేస్తారు. ఈ మేరకు అధికారులు సీఎం కార్యక్రమాల షెడ్యూల్‌ను విడుదల చేశారు.
