ఈరోజుల్లో చిన్న, చిన్న కారణాలకే కాపురాలను కూల్చుకుంటున్నారు కొందరు వ్యక్తులు. భార్య ఆమ్లెట్ వేయలేదని, చికెన్ వండలేదని, భర్త తనకు చీర కొనియ్యలేదని ఇలాంటి సిల్లీ రీజన్‌లతో గొడవలు పడి విడిపోవడం లేదా ఆత్మహత్యలు(Suicide) చేసుకుంటున్నారన్న వార్తలు వస్తూనే ఉన్నాయి. కనీసం తాము ఏదైనా చేసుకొని ఆత్మహత్య చేసుకుంటే తమ పిల్లలు ఏమైపోతారన్న ఆలోచన కూడా వారికి కలగడం లేదు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది.
ఈరోజుల్లో చిన్న, చిన్న కారణాలకే కాపురాలను కూల్చుకుంటున్నారు కొందరు వ్యక్తులు. భార్య ఆమ్లెట్ వేయలేదని, చికెన్ వండలేదని, భర్త తనకు చీర కొనియ్యలేదని ఇలాంటి సిల్లీ రీజన్‌లతో గొడవలు పడి విడిపోవడం లేదా ఆత్మహత్యలు(Suicide) చేసుకుంటున్నారన్న వార్తలు వస్తూనే ఉన్నాయి. కనీసం తాము ఏదైనా చేసుకొని ఆత్మహత్య చేసుకుంటే తమ పిల్లలు ఏమైపోతారన్న ఆలోచన కూడా వారికి కలగడం లేదు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. మేడ్చల్(Medchal) జిల్లా కుత్బుల్లాపూర్‌లో(Quthbullapur) ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది.
మేడ్చల్ జిల్లా పేట్‌బషీరాబాద్‌లో దంపతులు నరసింహారెడ్డి(Narsimha reddy), సత్యవేణి(Sathyaveni) నివాసం ఉంటున్నారు. ఈ జంటకు ఇద్దరు కుమారులున్నారు. అయితే కొన్ని రోజుల్లో చిన్న కొడుకు బర్త్ డే వస్తుంది. దీంతో కొడుకు బర్త్‌డే ఫంక్షన్‌ను కొంచెం గ్రాండ్‌గా చేద్దామని, ఓ గోల్డ్ చైన్ చేయించి చిన్నోడి మెడలో వేద్దామని భర్తను సత్యవేణి కోరింది. ఇందుకు నరసింహారెడ్డి అయిష్టంగా చూద్దాంలే అన్నాడు. తన కోరికకు నిర్లక్ష్యంగా భర్త సమాధానం చెప్పాడని మనస్తాపం చెందింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. భర్త ఇంటికి వచ్చి చూసి.. చుట్టుపక్కలవారి సాయంతో సత్యవేణిని కిందికి దించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తల్లి చనిపోవడంతో ఇద్దరు కుమారులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. చిన్నచిన్న కారణాలకు ఆత్మహత్య చేసుకునేంత వరకు వెళ్లి.. ఇలా పిల్లలకు తల్లి దూరం కావడంపై స్థానికులు చర్చించుకుంటున్నారు.