చిన్నారిపై హత్యాచారం కేసులో మరణశిక్ష
సంగారెడ్డి(Sanga reddy) జిల్లా పోక్సో కోర్టు(POCSO court) సంచలన తీర్పు ఇచ్చింది. ఆరేళ్ల బాలికపై అత్యాచారం(Rape), హత్య చేసిన కేసులో నిందితుడికి మరణశిక్ష విధిస్తూ(Death penalty) తీర్పు ఇచ్చింది. బీహార్‌లోని(Bihar) సికిందర్‌కు చెందిన అలీఖాన్ బీడీఎల్ పరిధిలో ఉండే ఆరేళ్ల బాలికపై గత అక్టోబర్ 16న గఫాఫర్ అత్యాచారం చేసి హతమార్చాడు. బీడీఎల్ పరిధిలో కూలీ చేసుకుంటూ జీవించే దంపతులు తమ మనవరాలిని సెక్యూరిటీ గార్డు దగ్గర ఉంచి పనికివెళ్లారు. మద్యం తాగి అక్కడే తిరుగుతన్న గఫాఫర్ అలీఖాన్ అనే వ్యక్తి చిన్నారికి కూల్ డ్రింక్ ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి తీసుకెళ్లాడు. కూల్‌డ్రింక్‌లో మత్తు మందు కలిపి తాగించాడు. పక్కనే ఉన్న చేనులోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. విషయం ఇంట్లో చెప్తుందన్న ఉద్దేశంతో అక్కడే హత్యచేశాడు. దీంతో నిందితుడిపై బాలిక కుటుంబసభ్యులు ఫిర్యాదు చేయగా పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు. కేసును విచారించిన ప్రత్యేక పోక్సో కోర్టు న్యాయమూర్తి జయంతి.. గఫాఫర్‌కు మరణశిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. అతని కుటుంబసభ్యులు చిన్నారి కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించారు. 27 ఏళ్ల తర్వాత జిల్లాలో కోర్టు మరణశిక్షను విధించినట్లు ఎస్పీ చెన్నూరి రూపేష్ వెల్లడించారు. కేసును త్వరితగతిన విచారించేందుకు హైకోర్టు నుంచి అనుమతి తీసుకున్నామని, కేవలం 11 నెలల వ్యవధిలోనేవిచారణ పూర్తిచేసి నిందితుడికి కోర్టు మరణ శిక్ష విధించిందని చెప్పారు. నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన అప్పటి ఎస్‌ఐ, విచారణ అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్‌లను ఎస్పీ అభినందించారు.