కన్న కూతురుని గొడ్డలితో నరికి చంపాడు ఓ కసాయి తండ్రి. వివరాళ్లోకెళితే.. పెద్దపల్లి - మంథని(Manthani) మండలం బట్టుపల్లి(Buttupally) గ్రామంలో తండ్రి కన్న కూతురుని హత్య(Murder) చేసిన ఘటన సంచలనంగా మారింది. గుండ్ల సదానందం(Gundla sadanandham) అనే వ్యక్తి తన కూతురు రజిత(Rajitha) (10)ను ఇంట్లోనే గొడ్డలితో నరికి చంపాడు.

A Father Brutally Killed His Daughter
కన్న కూతురుని గొడ్డలితో నరికి చంపాడు ఓ కసాయి తండ్రి. వివరాళ్లోకెళితే.. పెద్దపల్లి - మంథని(Manthani) మండలం బట్టుపల్లి(Buttupally) గ్రామంలో తండ్రి కన్న కూతురుని హత్య(Murder) చేసిన ఘటన సంచలనంగా మారింది. గుండ్ల సదానందం(Gundla sadanandham) అనే వ్యక్తి తన కూతురు రజిత(Rajitha) (10)ను ఇంట్లోనే గొడ్డలితో నరికి చంపాడు. అయితే గత కొంత కాలంగా సదానందం మానసిక స్థితి సరిగా లేక గ్రామంలో జనాలపై తరచుగా దాడులు చేస్తున్నాడని స్థానికులు తెలిపారు. కూతురును చంపిన తర్వాత అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తిపై కూడా దాడికి పాల్పడ్డాడు. నిందితున్ని తమకు అప్పగించాలని గ్రామస్తులు ఆందోళనకు దిగారు. పోలీసులపై గ్రామస్తులు దాడికి పాల్పడటంతోపాటు వాహనాలను ధ్వంసం చేశారు. దీంతో భట్టుపల్లి గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
