కాంగ్రెస్(congress) అధికారం లోకి వచ్చి 8నెలలు అవుతుంది, వచ్చినప్పటి నుంచి ప్రజాస్వామ్యం, ఇందిరమ్మ పాలన అని చెప్తూనే ఉన్నారు.

కాంగ్రెస్(congress) అధికారం లోకి వచ్చి 8నెలలు అవుతుంది, వచ్చినప్పటి నుంచి ప్రజాస్వామ్యం, ఇందిరమ్మ పాలన అని చెప్తూనే ఉన్నారు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు.. రోజు రోజుకీ మహిళలపై అత్యాచారాలు(rapes) పెరిగిపోయాయని సబితారెడ్డి అన్నారు. అసెంబ్లీలో(Assembly) నేను మాట్లాడిన 48 గంటల్లో మరిన్ని అత్యాచారాలు జరిగాయి కానీ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదు. మహిళలపై(Women) అత్యాచారాలు, హత్యలు(Murders) చేస్తుంటే కనీసం ఒక్క నిమిషం కూడా మాట్లాడనివ్వలేదు. ఆడబిడ్డలుగా నాలుగున్నర గంటలు నిలబెట్టినా కనీసం స్పీకర్‌(Speaker) మా మీద దయచూపలేదని సబిత ఇంద్రారెడ్డి అన్నారు. ఆడబిడ్డలను అసెంబ్లీలో నాలుగున్నర గంటలు నిలబెట్టిన చరిత్రలో సభలో నిలిచి పోతుందని సబితాఇంద్రారెడ్డి అన్నారు. మహిళలపై అత్యాచారాలు జరుగుతున్న ప్రభుత్వం మొద్దు నిద్ర పోతుందని విమర్శించారు. హైదరాబాద్ లో ఇన్ని అత్యాచారాలు జరిగితే హైదారాబాద్ ఇమేజ్ దెబ్బతింటుందని, ప్రభుత్వం ఇప్పటికైనా శాంతిభద్రతలపై దృష్టిపెట్టాలని సూచించారు.

Eha Tv

Eha Tv

Next Story