మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి(Sabitha Indra Reddy)మీడియాతో మాట్లాడుతూ మరోసారి కంటతడి పెట్టింది.
మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి(Sabitha Indra Reddy)మీడియాతో మాట్లాడుతూ మరోసారి కంటతడి పెట్టింది. అసెంబ్లీ(Assembly)లో కేటీఆర్ మాట్లాడుతుంటే సంయమనంతో వింటున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Cm Revanth Reddy)ఒక్కసారిగా మైక్ తీసుకొని మమ్మల్ని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు. 'అక్కలను నమ్ముకుంటే మమ్మల్ని ముంచిండ్రు.. కేటీఆర్(KTR)కు సూచన చేస్తున్నాం మిమ్మల్ని కూడా ముంచుతరు' అని రేవంత్ మమ్మల్ని అవమానించారన్నారు. ఏం ముంచినం.. ఆనాడు కాంగ్రెస్ పార్టీ(Congress Paty)లోకి రేవంత్‌ను నేనే ఆహ్వానించాని.. ఆవిశ్వాసం కూడా రేవంత్‌కు లేదన్నారు. 24 ఏళ్లుగా అసెంబ్లీకి వస్తున్నానని ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత నీచంగా మాట్లాడిన చరిత్ర లేదన్నారు. చంద్రబాబు(Chandrababu), వైఎస్(YSR),రోశయ్య(Rosaiah),కిరణ్‌కుమార్‌రెడ్డి(Kiran Kumar Reddy),కేసీఆర్(KCR)ను చూశామని ఇలాంటి ముఖ్యమంత్రిని ఎప్పుడూ చూడలేదన్నారు. ఈరోజు అసెంబ్లీలో మమ్మల్ని మాత్రమే రేవంత్ అవమానించలేదని రాష్ట్రంలోని మహిళలందరినీ అవమానించారన్నారు. సీఎం రేవంత్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. డిప్యూటీ సీఎం భట్టి కూడా అవమానకరంగా ఏ మొఖం పెట్టుకుని అసెంబ్లీకి వచ్చారంటున్నారు. మా కర్మకాలి అసెంబ్లీకి వచ్చామంటూ కంట తడి పెట్టుకున్నారు. పార్టీలో అంతర్గతంగా పొగ పెట్టి మమ్మల్ని పార్టీ నుంచి బయటకు పంపించారని సబిత విమర్శించారు.
మరో ఎమ్మెల్యే సునీతారెడ్డి(MLA Sunitha Reddy)మేము ఏ పార్టీలో ఉన్నా నిజాయితీగా పనిచేశామని అన్నారు. మహిళలుగా ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొని నిలిచామన్నారు. పార్టీలో నన్ను, సబితక్క, డీకే అరుణ(Dk Aruna)ను హ్యుమిలేట్ చేసి పంపిచారన్నారు. కేసీఆర్, కేటీఆర్ నాయకత్వంలో నిజాయితీగా పనిచేస్తున్నామని ప్రజా సమస్యల కోసం పోరాడుతుంటే అవమానిస్తారన్నారు. మహిళలు ఎక్కడ ఉన్నా అన్నాదమ్ములకు వచ్చి రాఖీ కట్టి వారు బాగుండాలని కోరుకుంటారని అలాంటి మమ్మల్ని అవమానించేలా మాట్లాడుతారా అంటూ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.