✕
Ruby Alkhatani : మిస్ యూనివర్స్ పోటీలకు సౌదీ బ్యూటీ క్వీన్.. ఆమె ప్రత్యేకతేమిటి?
By EhatvPublished on 28 March 2024 4:55 AM GMT
ఇటీవలే మిస్ వరల్డ్(Miss World) పోటీలు ముగిశాయి. ఆ అందాల పోటీలకు మన దేశమే ఆతిథ్యమిచ్చింది. ఇక ఇప్పుడు మిస్ యూనివర్స్(Miss Universe) వంతు! త్వరలో జరగబోయే ఈ పోటీలకు మలేషియా(Malaysia) వేదిక కాబోతున్నది. ఇదేం సంచలన వార్త కాదు కానీ ఈ పోటీలలో పాల్గొనేందుకు సౌదీ అరేబియా(Saudi Arabia) నుంచి ఓ అమ్మాయి సిద్ధం అవుతుండటం విశేషం. సౌదీ నుంచి ఇలా ఒక అమ్మాయి అందాల పోటీలలో పాల్గొనడం ఇదే ప్రథమం.

x
Ruby Alkhatani
-
- ఇటీవలే మిస్ వరల్డ్(Miss World) పోటీలు ముగిశాయి. ఆ అందాల పోటీలకు మన దేశమే ఆతిథ్యమిచ్చింది. ఇక ఇప్పుడు మిస్ యూనివర్స్(Miss Universe) వంతు! త్వరలో జరగబోయే ఈ పోటీలకు మలేషియా(Malaysia) వేదిక కాబోతున్నది. ఇదేం సంచలన వార్త కాదు కానీ ఈ పోటీలలో పాల్గొనేందుకు సౌదీ అరేబియా(Saudi Arabia) నుంచి ఓ అమ్మాయి సిద్ధం అవుతుండటం విశేషం. సౌదీ నుంచి ఇలా ఒక అమ్మాయి అందాల పోటీలలో పాల్గొనడం ఇదే ప్రథమం. 27 ఏళ్ల మోడల్ రూబీ అల్ఖాతానీ(Ruby Alkhatani) చరిత్ర సృష్టించడానికి సిద్ధమవుతున్నారు. ఇస్లామిక్ దేశాలలో మహిళపై అనేక ఆంక్షలు ఉంటాయి. సౌదీ అరేబియాలో ఇంకాస్త ఎక్కువగా ఉంటాయి.
-
- 38 ఏళ్ల సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ అల్ సౌద్ సౌదీని సంస్కరణల బాటలో నడిపిస్తున్నారు. ఆయనలో చాలా మార్పు వచ్చింది. ఇటీవలి కాలంలో పలు ఆంక్షల్ని సడలించారు. మహిళా డ్రైవర్లపై నిషేధం ఎత్తివేయడం, ఆహార్యం విషయంలో పెట్టిన నిబంధనల్ని సడలించడం, పురుషుల తోడు లేకుండా బయటికి వెళ్లే స్వేచ్ఛను అక్కడి మహిళలకు కల్పించడం ఇలా చాలా చాలా చేశారు. మహిళల అభిమానాన్ని చూరగొన్నారు. అలాగే అందాల పోటీలలో పాల్గొనే విషయంలో కూడా నియమాలను సడలించారు. ఇంతకాలం అక్కడి మహిళలు అంతర్గతంగా జరిగే అందాల పోటీలలో మాత్రమే పాల్గొనేవారు.
-
- తొలిసారిగా అంతర్జాతీయంగా జరిగే అందాల పోటీలలో పాల్గొనేందుకు సౌదీ అరేబియా అనుమతి ఇచ్చింది. సెప్టెంబర్‌లో మలేషియాలో జరగబోతున్న మిస్ యూనివర్స్ పోటీలకు సౌదీకి చెందిన రుమీ అల్ ఖతానీ పోటీ పడనుంది. దీంతో మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొననున్న తొలి సౌదీ అరేబియన్ మహిళగా ఆమె చరిత్ర సృష్టించనుంది. రియాద్‌లో పుట్టి పెరిగిన రియాద్ చిన్నప్పుడు చాలా ముద్దుగా అందంగా ఉండేది. అందాల పోటీలో పాల్గొనాలని అప్పుడే గట్టిగా అనుకుంది. టీనేజ్ దశలోనే మోడల్‌గా కెరీర్‌ను మొదలుపెట్టింది. అలాగని చదవును ఏ మాత్రం నిర్లక్ష్యం చేయలేదు.
-
- దంత వైద్యంలో పట్టా పుచ్చుకున్న రుమీకి కొత్త విషయాలు తెలుసుకోవడంపై అమితాసక్తి ఉంది. కొత్త భాషలను నేర్చుకోవాలన్న అభిరుచి కూడా ఉంది. అరబిక్, ఫ్రెంచ్, ఇంగ్లీషు భాషలలో ఆమె అనర్గళంగా మాట్లాడగలదు. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటారు. మోడల్‌గా తాను సాధించిన ఘనతల్ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. ఫ్యాషన్, అందం, లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై అవగాహన కల్పిస్తూ పోస్టులు పెడుతుంది. కంటెంట్ క్రియేటర్‌గా పేరు తెచ్చుకుంది.
-
- ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు 10 లక్షల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారంటే ఆమె క్రేజ్ ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు. ప్రయాణాలంటే ఈమెకు చాలా ఇష్టం. తాను సందర్శించే దేశాలను, ఆ దేశాలలోని ప్రత్యేకతలను ఫోటోలు, రీల్స్ రూపంలో షేర్ చేస్తుంటారు. తన కుటుంబమే తన బలం అని రుమీ చెబుతుంటారు.ఇక రుమీ ఇప్పటికే పలు అందాల పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచింది. అలా ఆమె మిస్ సౌదీ అరేబియా, మిస్ అరబ్ పీస్, మిస్ ఉమన్ సౌదీ అరేబియా, మిస్ యూరప్ సౌదీ అరేబియా, మిస్ ప్లానెట్ సౌదీ అరేబియా, మిస్ మిడిల్ ఈస్ట్ సౌదీ అరేబియా, మిస్ అరబ్ యునిటీ సౌదీ అరేబియా, మిస్ ఆసియా సౌదీ అరేబియా వంటి ఎన్నో టైటిళ్లు దక్కించుకుంది.

Ehatv
Next Story