టీఎస్ఆర్టీసీ(TSRTC) బిల్లు ఆమోదంపై గవర్నర్ జాప్యంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. రాజ్ భవన్(Raj bavan) ముట్టడికి ఆర్టీసీ కార్మికులు(RTC Workers) పిలుపునియ్యడంతో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటుచేశారు.
టీఎస్ఆర్టీసీ(TSRTC) బిల్లు ఆమోదంపై గవర్నర్ జాప్యంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. రాజ్ భవన్(Raj bavan) ముట్టడికి ఆర్టీసీ కార్మికులు(RTC Workers) పిలుపునియ్యడంతో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటుచేశారు. ఈ నేపథ్యంలో గవర్నర్ తమిళిసై కీలక నిర్ణయం తీసుకున్నారు. చర్చలకు రాజ్‌భవన్‌కు రావాలంటూ ఆర్టీసీ యూనియన్ నేతలకు గవర్నర్ ఆహ్వానం పంపారు. మరికాసేపట్లో ఆర్టీసీ ముఖ్య నాయకులతో తమిళిసై(Tamilisai Soundararajan) సమావేశం కానున్నారు. వీలుకాని పక్షంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గవర్నర్ చర్చించనున్నట్లు రాజ్‌భవన్ వర్గాలు తెలిపాయి.
రాష్ట్ర ప్రభుత్వం పంపిన లేఖను గవర్నర్ క్షుణ్ణంగా పరిశీలించారు. బిల్లులో స్పష్టతలేని అంశాలపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలిసిందిగా ప్రభుత్వానికి తెలియజేశారు. టీఎస్ఆర్టీసీ ఉద్యోగులు, రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం బిల్లులోని అంశాలపై గవర్నర్ ప్రభుత్వాన్ని స్పష్టత కోరుతున్నట్లు ప్రకటనలో తెలియజేశారు.
ఐదు అంశాలపై వివరణ కోరిన గవర్నర్
1958 నుండి ఆర్టీసీలో కేంద్ర గ్రాంట్ లు, వాటాలు, లోన్లు, ఇతర సహాయం గురించి బిల్లులో ఎలాంటి వివరాలు లేవని గవర్నర్ అన్నారు.
రాష్ట్ర విభజన చట్టం షెడ్యూల్ IX ప్రకారం.. ఆర్టీసీ స్థితిని మార్చడంపై సమగ్ర వివరాలు బిల్లులో లేవని గవర్నర్ సందేహం వ్యక్తం చేశారు.
ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగుల తో సమానం గా పరిగణిస్తామని చెబుతున్న ప్రభుత్వం.. వారి సమస్యలకు ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ చట్టం, కార్మిక చట్టాలు వర్తిస్తాయా..? వారి ప్రయోజనాలు ఎలా కాపాడబడతాయని గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
విలీనం డ్రాఫ్ట్ బిల్లులో ఆర్టీసీ ఉద్యోగులు అందరికీ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పెన్షన్ ఇస్తారా, వారికి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని ప్రయోజనాలు ఇవ్వడానికి సంబంధించి స్పష్టమైన వివరాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని గవర్నర్ కోరారు.
ప్రభుత్వ ఉద్యోగులలో కండక్టర్, కంట్రోలర్ లాంటి తదితర పోస్టులు లేనందున వారి ప్రమోషన్లు, వారి క్యాడర్ నార్మలైజేషన్ లాంటి విషయాల్లో ఆర్టీసీ ఉద్యోగులకు న్యాయం, ఇతర ప్రయోజనాలు అదే విధంగా స్పష్టమైన వివరాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని గవర్నర్ కోరారు. అలాగే.. ఆర్టీసీ కార్మికుల భద్రత, భవిష్యత్ ప్రయోజనాలపై మరిన్ని స్పష్టమైన హామీలు ఇవ్వాలంటూ ప్రభుత్వాన్ని కోరారు.