TS Elections 2023 : సొంతూళ్లకు జనం..ఎన్నికల దసరాతో హైదరాబాద్ ఖాళీ !
దసరా..సంక్రాంతి వచ్చిందంటే చాలు.. రాష్ట్ర రాజధాని హైదరాబాద్(Hyderabad) ఖాళీ అయిపోతుంది. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోతాయి. సొంతూళ్లకు(Native place) వెళ్లేవారితో బస్టాండ్లు(Bus stop), రైల్వే స్టేషన్లు(Railway stations) ప్రయాణికుల రద్దీతో కిటకిటలాడుతాయి. హైదరాబాద్లో ఇప్పుడు అచ్చంగా అదే సీన్ కనిపిస్తోంది. ఎన్నికల జాతరలో(Elections) అత్యంత కీలకమైన పోలింగ్(Elections polling) రేపు జరుగనుండటంతో..ఓటేసేందుకు జనం గ్రామాలకు తరలి వెళ్తున్నారు.

ఎన్నికల సదరా రావడంతో హైదరాబాద్ ఖాళీ అయ్యింది. తమ ఓటు వేసేందుకు జనం తండోప తండాలుగా సొంతూళ్లకు వెళ్లిపోతున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆయా ప్రాంతాల నుంచి ఉద్యోగ, ఉపాధి కోసం హైదరాబాద్ వచ్చిన జనం లక్షల్లోనే ఉంటారు. వీరంతా హైదరాబాద్లోనే పని చేస్తున్నా.. ఓటు మాత్రం ఇంకా సొంతూళ్లలోనే ఉంది. దీంతో ఆయా పార్టీల అభ్యర్థులు.. స్థానికంగా ఉండని ఓటర్లను ముందుగానే గుర్తించి..ఓటు వేసేందుకు సొంతూరు రావాలని పట్టుబడుతున్నారు. వారి కోసం ప్రత్యేక రవాణా సదుపాయాలు(Transport Facility) కూడా కల్పిస్తున్నారు.
హైదరాబాద్ నుంచి గ్రామాలకు వెళ్లే వారి సంఖ్య లక్షల్లో ఉండటంతో ఇటు జూబ్లీ బస్టాండ్(Jublie Bus Stop), అటు ఎంజీబీఎస్ బస్టాండ్లు(MG Bus Stop) ప్రయాణికులతో కిటకిటలాడిపోతున్నాయి. అటు సిటీ శివారు ప్రాంతాల్లోనూ ప్రయాణిలకు రద్దీ విపరీంతంగా ఉంది. ఉప్పల్, పఠాన్ చెరు, ఎల్బీనగర్, కొంపల్లి, సుచిత్ర, బోయినపల్లి, ఆల్వాల్, ఆరాంఘర్ ప్రాంతాల్లో బస్సులు, ప్రైవేట్ వాహనాల కోసం ప్రయాణికులు వేచి ఉండే పరిస్థితి కనిపిస్తోంది. ఆర్టీసీ బస్సులన్నీ(RTC Buses) ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. దీంతో ఏ బస్సు దొరికితే ఆ బస్సు ఎక్కి వెళ్లిపోతున్నారు.
ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్(Election commission) డిసెంబర్ 30న సెలవు దినంగా పాటించాలని ఈసీ కోరింది. గత ఎన్నికల్లో ఐటీ కంపెనీలు(IT companies) సెలవు ఇవ్వని విషయాన్ని గుర్తు చేస్తూనే.. ఈసారి గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఉద్యోగులకు కచ్చితంగా సెలవు ఇవ్వాలని ప్రయివేట్ కంపెనీలకు ఎలక్షన్ కమిషన్ సర్య్కులర్ కూడా జారీ చేసింది. దీంతో పెద్ద, చిన్న ఐటీ కంపెనీలన్నీ డిసెంబర్ 3ను సెలవు దినంగా ప్రకటించాయి.
ప్రతి ఎన్నికలతో పోల్చితే.. ఈసారి కొంచెం రద్దీ ఎక్కువగానే కనిపిస్తోంది. సొంతూళ్ల నుంచి ఒత్తిడి కూడా అదే స్థాయిలో ఉంది. అన్ని కంపెనీలు సెలవులు ప్రకటించటంతో తప్పనిసరిగా గ్రామాలకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో సొంతూళ్లకు వెళ్తున్న వారితో హైవేలన్నీ వాహనాలతో రద్దీగా మారిపోయాయి.