తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మీ పథకం కింద ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించిన విషయం తెలిసిందే.

RTC MD Sajjanar appeals to women passengers
తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) మహాలక్ష్మీ పథకం(Mahalakshmi Scheme) కింద ఆర్టీసీ బస్సు(RTC Bus)లలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించిన విషయం తెలిసిందే. ఈ పథకానికి అనూహ్య స్పందన వస్తోంది. బస్సులు అన్ని కిటకిటలాడుతున్నాయి. దీంతో బస్సులలో ప్రయాణించాలనుకున్న మగవారికి ఇబ్బందులు మొదలయ్యాయి. దీంతో పలువురు తమ ఆవేదనను వెళ్లగక్కారు. ఈ క్రమంలోనే మహిళా ప్రయాణికులకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్(TSRTC MD Sajjanar) ఓ విజ్ఞప్తి చేశారు.
ఎక్స్ ప్రెస్ బస్సు(Express Buses)ల్లో తక్కువ దూరం ప్రయాణించే మహిళలు ఎక్కువగా వెళ్తున్నట్లు టీఎస్ఆర్టీసీ(TSRTC) యాజమాన్యం దృష్టికి వచ్చింది. దీనివల్ల దూర ప్రాంత ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోందన్నారు. తక్కువ దూరం ప్రయాణించే వారు పల్లె వెలుగు బస్సుల్లో ఎక్కి.. సిబ్బందికి సహకరించాలని కోరారు. అలాగే.. కొందరు మహిళలు అనుమతించిన స్టేజీల్లో కాకుండా మధ్యలోనే బస్సులను ఆపమని సిబ్బందిపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో ప్రయాణ సమయం పెరుగుతోంది. ఇక నుంచి ఎక్స్ ప్రెస్ బస్సులను అనుమతించిన స్టేజీల్లోనే ఆపడం జరుగుతుందని స్పష్టం చేశారు. దూర ప్రాంత ప్రయాణికులకు ప్రాధాన్యత ఇచ్చి.. సిబ్బందికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
