భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పెనుప్రమాదం తప్పింది. బొగ్గుతో వెళ్తున్న లారీ, ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో బస్సులోని 43 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. భద్రాచలం డిపో నుంచి ఆదివారం ఉదయం ప్రయాణికులతో ఆర్టీసీ బస్సు విజయవాడ మీదుగా గుంటూరు వెళ్లేందుకు బయలుదేరింది.

RTC bus overturns after lorry hits in Bhadradri Kothagudem district
భద్రాద్రి కొత్తగూడెం(Bhadradri Kothagudem) జిల్లాలో పెనుప్రమాదం తప్పింది. బొగ్గుతో వెళ్తున్న లారీ(Lorry), ఆర్టీసీ బస్సు(Bus)ను ఢీకొట్టడంతో బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో బస్సులోని 43 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. భద్రాచలం(Bhadrachalam) డిపో నుంచి ఆదివారం ఉదయం ప్రయాణికులతో ఆర్టీసీ బస్సు విజయవాడ(Vijayawada) మీదుగా గుంటూరు(Guntur) వెళ్లేందుకు బయలుదేరింది. చుంచుపల్లి(Chunchupalli) మండలం ఆనందగని(Anand Ghani) వద్దకు రాగానే బొగ్గు లారీ రోడ్డుకు అడ్డంగా అతివేగంతో వచ్చి బస్సును ఢీకొట్టింది. దీంతో బస్సు రెండు పల్టీలు కొట్టి బోల్తా పడింది. బస్సులో ప్రయాణిస్తున్న వారిలో నలుగురికి తీవ్ర గాయాలు కాగా.. మిగిలిన వారికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రి(Kothagudem Govt Hospital)కి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 51 మంది ప్రయాణికులు ఉన్నారని చెప్పారు. ఎలాంటి ప్రాణ నష్టం జరుగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
