తెలంగాణలో ఆర్టీఏ(RTA) కొత్త సిరీస్‌ను మొదలు పెట్టింది. టీజీ సిరీస్‌(TG Series) ప్రారంభమైన మొదటి రోజే వాహనదారులు తమ మోజును చాటుకున్నారు. హైదరాబాద్‌ నగరంలోని వివిధ ప్రాంతీయ రవాణా కార్యాలయాల్లో ప్రత్యేక నంబర్లకు(Special number plates) నిర్వహించిన ఆన్‌లైన్‌ బిడ్డింగ్‌కు అనూహ్యమైన స్పందన వచ్చింది.

తెలంగాణలో ఆర్టీఏ(RTA) కొత్త సిరీస్‌ను మొదలు పెట్టింది. టీజీ సిరీస్‌(TG Series) ప్రారంభమైన మొదటి రోజే వాహనదారులు తమ మోజును చాటుకున్నారు. హైదరాబాద్‌ నగరంలోని వివిధ ప్రాంతీయ రవాణా కార్యాలయాల్లో ప్రత్యేక నంబర్లకు(Special number plates) నిర్వహించిన ఆన్‌లైన్‌ బిడ్డింగ్‌కు అనూహ్యమైన స్పందన వచ్చింది. ఖైరతాబాద్‌లో నిర్వహించిన బిడ్డింగ్‌లో ప్రత్యేక నెంబర్లపైన 30.49 లక్షల రూపాయలు లభించింది. టీజీ 09 0001 నెంబర్‌ కోసం రుద్రరాజు రాజీవ్‌ కుమార్‌ అనే వాహన యజమాని బిడ్డింగ్‌లో ఏకంగా 9.61 లక్షల రూపాయలు చెల్లించి ఆ ఫాన్సీ నంబర్‌ను సొంతం చేసుకున్నాడు. అలాగే టీజీ 09 0909 నం‌బర్‌కు భవ్యసింధు ఇన్‌ఫ్రా సంస్థ 2.30 లక్షల రూపాయలు చెల్లించింది. టీజీ 09 0005 నంబర్‌ కోసం శాన్వితారెడ్డి 2.21 లక్షల రూపాయలు చెల్లించారు. టీజీ 09 0002 నంబర్‌ను దుశ్యంత్‌ రెడ్డి అనే వాహనయజమాని 1.22 లక్షల రూపాయలు పెట్టి సొంతం చేసుకున్నారు . అలాగే టీజీ 09 0369 నంబర్‌కు 1.20 లక్షల రూపాయలు, టీజీ 09 0007 నంబర్‌కు 1.07 లక్షల రూపాయలు చెల్లించారు.

Updated On 16 March 2024 2:15 AM GMT
Ehatv

Ehatv

Next Story