బీఎస్పీ(BSP) రానున్న తెలంగాణ ఎన్నిక‌ల‌లో స‌త్తా చాటాల‌ని భావిస్తుంది. ఈ క్ర‌మంలోనే బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డా ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) మంగ‌ళ‌వారం బహుజన భ‌రోసా పేరుతో పార్టీ మ్యానిఫెస్టో-2023(Manifesto 2023) ను విడుదల చేశారు.

బీఎస్పీ(BSP) రానున్న తెలంగాణ ఎన్నిక‌ల‌లో స‌త్తా చాటాల‌ని భావిస్తుంది. ఈ క్ర‌మంలోనే బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డా ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) మంగ‌ళ‌వారం బహుజన భ‌రోసా పేరుతో పార్టీ మ్యానిఫెస్టో-2023(Manifesto 2023) ను విడుదల చేశారు. హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని(Baglingampally) సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో(Sundarayya Science Centre) ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన ఆయ‌న.. బీఎస్పీ మ్యానిఫెస్టో-2023 ద్వారా తెలంగాణ ప్రజలకు 10 ప్రధాన హామీలను ఇస్తున్న‌ట్లు వివ‌రించారు.

బీఎస్పీ మ్యానిఫెస్టోలో ప్ర‌ధాన హామీలు :

1. కాన్షీ యువ సర్కార్:

యువతకు ఐదేళ్లల్లో 10 లక్షల ఉద్యోగాలు (అందులో మహిళలకు 5 లక్షల కొలువులు).

షాడో మంత్రులుగా విద్యార్థి నాయకులు.

2. పూలే విద్యా దీవెన:

మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్.

ప్రతి మండలం నుంచి ఏటా 100 మంది విద్యార్థులకు విదేశీ విద్య. డేటా, ఏఐ, కోడింగ్ ల‌లో శిక్షణ.

3. బహుజన రైతు ధీమా:

ప్రతి పంటకు కనీస మద్దతు ధరతో కొనుగోలు.

రైతులకు విత్తు నుండి విక్రయం వరకు ఖచ్చితమైన ప్రభుత్వ రాయితీ. ధరణి పోర్టల్ రద్దు

4. చాకలి ఐలమ్మ మహిళా జ్యోతి:

మహిళా కార్మికులు, రైతులకు ఉచిత వాషింగ్ మెషిన్, స్మార్ట్ ఫోన్, డ్రైవింగ్ శిక్షణ.

అంగన్‌వాడీ, ఆశా వర్కర్ల ఉద్యోగులు క్రమబద్దీకరణ.

మహిళా సంఘాలకు ఏటా రూ. 1 లక్ష

5. భీం రక్షా కేంద్రాలు:

వృద్ధులకు హాస్టల్, ఆహారం, ఉచిత వైద్య సేవలు.

రక్షా కేంద్రాల్లో వికలాంగులకు, ఒంటరి మహిళలకు తోడ్పాటు.

6. బ్లూ జాబ్ కార్డ్‌:

పల్లె, పట్టణాల్లో 150 రోజుల ఉపాధి హామీ.

రోజూ కూలీ రూ. 350 కి పెంపు.

కూలీలకు ఉచిత రవాణా, ఆరోగ్య, జీవిత భీమా

7. నూరేళ్ళ ఆరోగ్య ధీమా:

ప్రతి కుటుంబానికి రూ. 15 లక్షల ఆరోగ్య భీమా ప్యాకేజీ.

ఏటా రూ. 25,000 కోట్లతో పౌష్టికాహార, ఆహార బడ్జెట్‌

8. వలస కార్మికుల సంక్షేమ నిధి:

5,000 కోట్ల నిధితో గల్ఫ్ కార్మికులకు సంక్షేమ బోర్డు

వలస కార్మికులకు వసతి

గిగ్ కార్మికులు, లారీ, టాక్సీ డ్రైవర్లకు 600 సబ్సిడీ క్యాంటీన్లు

9. షేక్ బందగీ గృహ భరోసా:

ఇల్లు లేని వారికి 550 చ.గ. ఇంటి స్థలం

ఇల్లు కట్టుకునే వారికి రూ. 6 లక్షలు సహాయం

ఇంటి పునర్నిర్మాణానికి రూ.1 లక్ష సహాయం

10. దొడ్డి కొమురయ్య భూమి హక్కు :

భూమిలేని ప్రతి పేద కుటుంబానికి ఒక ఎకరం భూమి, మహిళల పేరిట పట్టా

Updated On 17 Oct 2023 3:48 AM GMT
Ehatv

Ehatv

Next Story