అసెంబ్లీ నుంచి జగదీష్‌రెడ్డి సస్పెన్షన్‌పై ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అసెంబ్లీ నుంచి జగదీష్‌రెడ్డి సస్పెన్షన్‌పై ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్టు చేశారు. '' నేను నిన్న అసెంబ్లీలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మరియు స్పీకర్ గార్ల మధ్య సంభాషణ వీడియోలు చూశాను. ఇందులో గౌరవ స్పీకర్ గారిని ఘోరంగా అవమానించింది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జగదీష్ రెడ్డి కాదు. ఆయన(GJR) ఆద్యంతం అధ్యక్షా, మీ, మీరు అనే సంభోదించిండ్రు. కానీ కాంగ్రేసు ఎమ్మెల్యేలు మాత్రం ఒక సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి, సహన శీలి అయిన స్పీకర్ గారికి ‘దళిత’ అనే ట్యాగ్ వెంటనే తగిలించి ఆయన్ని అవమానించారు. తన అసమర్థతను కప్పి పుచ్చుకోవడానికి, ఆయనను పావుగా వాడుకున్నారు.

స్పీకర్ అంటే స్పీకర్. అంతే. దళిత స్పీకర్, గిరిజన స్పీకర్, బీసీ స్పీకర్, మహిళా స్పీకర్ ఇలా ఎవరూ ఉండలేరు...! ఏ రాజ్యాంగం కూడా ఈ రకమైన విశేషణాలను అనుమతించదు. అంటే ఆయన కేవలం దళితుడనే మీ రు స్పీకర్ చేసిండ్రా, లేదా ఆయన ప్రతిభను చూసి చేసిండ్రా??? దళిత అధికారి, దళిత జడ్జి, గిరిజన పోలీసు, బీసీ మంత్రి, మహిళా ఇన్స్పెక్టర్ ఇవన్నీ ఆ వ్యక్తుల మనోభావాలను గాయపరుస్తాయి. వాళ్లు ఎన్నో పోరాటాలు చేసి ఈ స్థాయికి చేరుకొని ఉంటారు. ఆ పోజిషన్ లోకి రావడం వాళ్ల హక్కు.

కాంగీయులారా, మీకు నిజంగా ఈ అణచివేతకు గురైన వర్గాల మీద ప్రేమ ఉంటే ప్రభుత్వ పాఠశాలల్లో, గురుకులాల్లో ఈ వర్గాల విద్యార్థులపై జరుగుతున్న ఘోరాలను అరికట్టండి. కాంట్రాక్టు ల్లో ఈ వర్గాల వెలివేతను ఆపండి. ఈ వర్గాల కు చేందిన ఉద్యోగులపై కనిపించని అణచివేతను అడ్డుకోండి.

గౌరవనీయులైన స్పీకర్ సర్,

పట్టపగలు మీ పోస్ట్‌కు మీ సామాజిక గుర్తింపును ట్యాగ్ చేయడం ద్వారా మిమ్మల్ని అవమానించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను దయచేసి సస్పెండ్ చేయండి సార్. జై భీమ్. జై హింద్''

ehatv

ehatv

Next Story