కామారెడ్డి(Kamareddy) బీసీ డిక్లరేషన్ లో(BC Declaration) ఇచ్చిన హామీ ప్రకారం తక్షణమే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి, కులగణన బిల్లు పెట్టి, చట్టబద్ధత కల్పించాలని కోరుతూ బీసీ కుల, సంఘాలతో ఇవాళ మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం అయిదు గంటల వరకు సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో(Press club) రౌండ్ టేబుల్ సమావేశం(Round table Discussion) జరగనుంది. దీనికి బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం అధ్యక్షత వహిస్తారు.
కామారెడ్డి(Kamareddy) బీసీ డిక్లరేషన్ లో(BC Declaration) ఇచ్చిన హామీ ప్రకారం తక్షణమే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి, కులగణన బిల్లు పెట్టి, చట్టబద్ధత కల్పించాలని కోరుతూ బీసీ కుల, సంఘాలతో ఇవాళ మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం అయిదు గంటల వరకు సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో(Press club) రౌండ్ టేబుల్ సమావేశం(Round table Discussion) జరగనుంది. దీనికి బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం అధ్యక్షత వహిస్తారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య(R Krishnaiah), రాజ్యసభ మాజీ సభ్యుడు బండ ప్రకాష్ ముదిరాజ్(Prakash Mudhiraj), బీఆర్ఎస్ నేత, ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar), సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్, బీసీ టైమ్స్ సంపాదకులు సంగెం సూర్యారావు, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య, గిరిజన రిజర్వేషన్ సాధన సమితి చైర్మన్ సంజీవ్ నాయక్, ఆల్ ఇండియా ఓబీసీ జాక్ చైర్మన్ సాయిని నరేందర్, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేకపోతుల నరేందర్ గౌడ్, హిందూ బీసీ మహాసభ అధ్యక్షుడు బత్తుల సిద్ధేశ్వర్, మున్నూరుకాపు సంఘం అధ్యక్షుడు పుట్టం పురుషోత్తం పటేల్, మాజీ కార్పొరేషన్ చైర్మన్ నాగేందర్ గౌడ్, అఖిల భారత యాదవ మహాసభ జాతీయ కార్యదర్శి రమేష్ యాదవ్, యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు మేకల రాములు యాదవ్, బీసీ ఐక్యవేదిక చైర్మన్ కాటం నర్సింహ యాదవ్ తదితరులు పాల్గొంటున్నారు.