ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టుపై రాంగోపాల్‌ వర్మ మరో ట్వీట్ చేశారు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టుపై రాంగోపాల్‌ వర్మ మరో ట్వీట్ చేశారు. ఐకాన్ స్టార్, పుష్పఫేమ్ అల్లు అర్జున్‌ను శుక్రవారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించినా.. అల్లు అర్జున్‌(Allu Arjun) తరపు లాయర్లు హైకోర్టులో క్వాష్‌ పిటిషన్ వేశారు. హైకోర్టు అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్‌ ఇచ్చింది. ఈ సందర్భంగా రాంగోపాల్ వర్మ(Ramgopal varma) ట్వీట్ చేశారు. భారతదేశపు బిగ్గెస్ట్ స్టార్ ఆఫ్ ఇండియా, తెలంగాణా రాష్ట్ర నివాసి, భారతీయ సినిమా మొత్తం చరిత్రలో బిగ్గెస్ట్ హిట్ అందించడం ద్వారా తెలంగాణ రాష్ట్రానికి గొప్ప బహుమతిని అందించారు.. కానీ తెలంగాణ రాష్ట్రం అతనికి గొప్ప రిటర్న్‌ గిఫ్ట్‌ ఇచ్చిందని ఆర్జీవీ(RGV) ట్వీట్ చేశారు. బిగ్గెస్ట్ స్టార్‌ను జైలుకు పంపించి రిటర్న్‌ గిఫ్ట్‌ ఇచ్చారన్నారు.

ehatv

ehatv

Next Story