బీఆర్‌ఎస్ పార్టీ(BRS Party) హెడ్ క్వార్టర్స్ తెలంగాణభవన్‌కు రెవెన్యూశాఖ(Revenue Department) అధికారులు బుధవారం నోటీసులు(Notices) జారీ చేశారు. పార్టీ ఆఫీసులో టీన్యూస్ ఛానెల్(Tnews Channel) ద్వారా వ్యాపారం చేయడంపై నోటీసులో అభ్యంతరం తెలిపింది రెవెన్యూశాఖ.

Notices To Telangana Bhavan
బీఆర్‌ఎస్ పార్టీ(BRS Party) హెడ్ క్వార్టర్స్ తెలంగాణభవన్‌కు రెవెన్యూశాఖ(Revenue Department) అధికారులు బుధవారం నోటీసులు(Notices) జారీ చేశారు. పార్టీ ఆఫీసులో టీన్యూస్ ఛానెల్(Tnews Channel) ద్వారా వ్యాపారం చేయడంపై నోటీసులో అభ్యంతరం తెలిపింది రెవెన్యూశాఖ. ఎప్పటిలోగా న్యూస్ ఛానెల్ ఆఫీసును షిఫ్ట్ చేస్తారో వారంలోగా చెప్పాలని తెలంగాణభవన్ ఇన్‌ఛార్జ్ శ్రీనివాసరెడ్డిని(Srinivas Reddy) కోరారు. 2011 నుంచి తెలంగాణభవన్‌లోనే టీ న్యూస్ ఛానెల్‌ను నిర్వహిస్తూ వస్తున్నారు. ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓటమి తర్వాత ఛానెల్‌ను మరో భవనానికి తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు. తాజా నోటీసుతో తరలింపు ప్రక్రియను వేగవంతం చేశారు.
