తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా నేడు రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయ‌నున్నారు. రేవంత్ ఇప్ప‌టికే ప్రజా ప్రభుత్వ ప్రమాణస్వీకారానికి ప్రజలకు ఆహ్వానం పంపారు.

తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి(Telangana CM)గా నేడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) ప్రమాణస్వీకారం చేయ‌నున్నారు. రేవంత్ ఇప్ప‌టికే ప్రజా ప్రభుత్వ ప్రమాణస్వీకారానికి ప్రజలకు ఆహ్వానం(Invitation) పంపారు. దీంతో భారీ ఎత్తున ప్ర‌జ‌లు ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రుకానున్నారు. మధ్యాహ్నం 1.04 నిమిషాలకు రేవంత్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకారం అనంత‌రం ఆరు గ్యారెంటీలపై రేవంత్ తోలి సంతకం చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

ఇక ఈ కార్య‌క్ర‌మానికి అధికారులు, కాంగ్రెస్ శ్రేణులు ఏల్బీ స్టేడియంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఏఐసీసీ అధ్య‌క్షుడు ఖర్గే(Mallikarjun Kharge), సోనియా(Sonia Gandhi), రాహుల్(Rahul), ప్రియాంక గాంధీ(Priyanka Gandhi)లు ప్రమాణ స్వీకారానికి రానున్నారు. అలాగే ఏఐసీసీ పెద్దలు, పలు రాష్ట్రాల కీలక నేతలు కార్యక్రమానికి హాజ‌రుకానున్నారు. తెలంగాణ అమరవీరుల కుటుంబ సభ్యులు ఈ కార్య‌క్ర‌మానికి ప్రత్యేక ఆహ్వానితులుగా, ఆత్మీయ అతిధులుగా తెలంగాణ ఉద్యమకారులు హాజ‌రు అవుతున్నారు.

రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల అధినేతలకు కాంగ్రెస్(Congress) ఆహ్వానం పంపింది. ఈ మేర‌కు స్టేడియంలో మూడు వేదికల ఏర్పాటు చేశారు. ప్రధాన వేదికపై ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది. లెఫ్ట్ సైడ్ 63 సీట్లతో ఎమ్మెల్యేల కోసం ప్రత్యేక వేదిక.. రైట్ సైడ్ వీవీఐపీల కోసం 150 సీట్లతో మరో వేదిక ఏర్పాటు చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా 500 మందితో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వ‌హించ‌నున్నారు. గోండు, డప్పు, ఒగ్గు, బోనాలు, షేరీ బ్యాండ్ కళాకారులతో రేవంత్ కి స్వాగతం ప‌లుక‌నున్నారు.

వేదిక కింద అమరవీరుల కుటుంబాల కోసం 300 సీట్లతో ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేశారు. తెలంగాణ మేధావులు, ఉద్యమకారుల కోసం 250 సీట్లతో మరో గ్యాలరీ ఏర్పాటు చేశారు. ముప్పై వేల మంది సాధారణ ప్రజలు కూర్చొనే విధంగా కూడా ఏర్పాట్లు పూర్త‌య్యాయి. స్టేడియం బయట వీక్షించేందుకు భారీ ఎల్ఈడీ స్క్రీన్ లు ఏర్పాటు చేశారు.

Updated On 6 Dec 2023 10:21 PM GMT
Yagnik

Yagnik

Next Story