టీఎస్‌పీఎస్‌సీ పేపర్‌ లీక్‌(TSPSC Paper Leak) వ్యవహారం తెలంగాణ రాజకీయాల(Telangana Politics)ను కుదిపేస్తోంది. ప్రభుత్వంపై విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. పేపర్‌ లీక్‌ ఘటనకు మంత్రి కేటీఆర్‌(Minister KTR) బాధ్యత వహించాలని పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి(TPCC Chief Revanth Reddy) అన్నారు.

టీఎస్‌పీఎస్‌సీ పేపర్‌ లీక్‌(TSPSC Paper Leak) వ్యవహారం తెలంగాణ రాజకీయాల(Telangana Politics)ను కుదిపేస్తోంది. ప్రభుత్వంపై విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. పేపర్‌ లీక్‌ ఘటనకు మంత్రి కేటీఆర్‌(Minister KTR) బాధ్యత వహించాలని పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి(TPCC Chief Revanth Reddy) అన్నారు. తప్పు చేసిన వారిపై క్రిమినల్‌ కేసులు పెట్టాలని డిమాండ్‌ చేశారు. పనిలో పనిగా టీఎస్‌పీఎస్‌సీలో ఏపీ ఉద్యోగుల(AP Employees)పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పేపర్‌ లీకేజ్‌ కేసులో నిందితుడు ప్రవీణ్‌కుమార్‌( Praveen Kumar) ఆంధ్రప్రదేశ్‌(AP)లోని రాజమండ్రి(Rajahmundry)కి చెందిన వ్యక్తి అని చెబుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌(CM KCR) 60 ఏండ్ల పోరాటాన్ని, 1200 మంది విద్యార్థుల బలిదానాలను, 30 లక్షల విద్యార్థుల భవిష్యత్తును రాజమండ్రికి చెందిన ప్రవీణ్‌ కుమార్‌ చేతిలో పెట్టారని విమర్శించారు. ఎన్నో పోరాటాలు, మరెన్నో త్యాగాలు చేసి తెలంగాణ తెచ్చుకున్నామని, తెలంగాణ వచ్చి తొమ్మిదేళ్లు గడిచినా, తెలంగాణకు చెందిన వ్యక్తి కంప్యూటర్ అసిస్టెంట్ ఉద్యోగానికి కూడా పనికిరాడని మండిపడ్డారు రేవంత్‌. అలాగే జరిగిన నష్టాన్ని విచారణ చేయడానికి తెలంగాణకు చెందిన అధికారి ఒక్కరు కూడా కేసీఆర్‌కు కనిపించలేదా అని ప్రశ్నించారు. తెలంగాణకు చెందిన నిజాయితీ అధికారులు ఎందరో ఉన్నారని కానీ, టీఎస్‌పీఎస్‌సీ కేసును విచారిస్తున్న సిట్ అధికారి ఏఆర్ శ్రీనివాస్ విజయవాడకు చెందిన వ్యక్తి అని రేవంత్‌ అన్నారు. ఆనాడు కేసీఆర్, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు సమైక్య పాలనలో తెలంగాణకు చెందిన వ్యక్తి అడ్వొకేట్ జనరల్ గా లేడని చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తూ మరి ఇప్పుడు టీఎస్‌పీఎస్‌సీలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ గా పనిచేయడానికి తెలంగాణ బిడ్డ లేడా..? అని నిలదీశారు రేవంత్‌రెడ్డి..

Updated On 23 March 2023 5:56 AM GMT
Ehatv

Ehatv

Next Story