'వెనకాల ఉండే అక్కలు.. ఇక్కడ ఉండి చెప్పి చెప్పి ఇక్కడ ముంచి అక్కడ తేలారు.

'వెనకాల ఉండే అక్కలు.. ఇక్కడ ఉండి చెప్పి చెప్పి ఇక్కడ ముంచి అక్కడ తేలారు. ఆ అక్కల మాటలు వింటే.. జూబ్లీ బస్టాండ్లో(Jubilee Bus Stand)కూర్చోవాల్సి వస్తది' ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్‌రెడ్డి(Revanth Reddy) అసెంబ్లీ సాక్షిగా అన్న మాటలు ఇవి! ఈ వ్యాఖ్యలు బీఆర్‌ఎస్ మహిళా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని(BRS MLA Sabitha indra reddy) ఉద్దేశించి చేసినవి! ఇవి సబితా ఇంద్రారెడ్డిని బాధించాయి. తీవ్ర ఆవేదనకు గురి చేశాయి. అసెంబ్లీలో(Assembly) ఆడబిడ్డలను ఇలా అంటారా అంటూ సబిత ప్రశ్నించారు. 'ముఖ్యమంత్రి ఏ పార్టీలో నుంచి వ‌చ్చారు..? ఏ పార్టీ నుంచి ఏ పార్టీలోకి మారారు.? వీటిన్నింటిపై త‌ప్ప‌కుండా చ‌ర్చ పెడుతాం. కేసీఆర్(KCR)ఇంటి మీద వాలిన కాకి నా ఇంటి మీద వాలితే కాల్చేస్తా అని రేవంత్ రెడ్డి అన్నారు. మ‌రి ఎంత మంది ఉన్నారు.. ఎంత మందిని కాల్చేస్తారు. ఎందుకు చేర్చుకున్నారు..? ఇప్పుడేమో సీఎం ఎంజాయ్ చేస్తున్నారు' అంటూ స‌బితా ఇంద్రారెడ్డి నిప్పులు చెరిగారు. 'గుండె మీద చేయి వేసుకుని చెప్పాలి సీఎం. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ(Congress Party)లోకి వ‌చ్చిన‌ప్పుడు ఒక అక్క‌గా రేవంత్‌ను ఆశీర్వ‌దించాను. బాబు నువ్వు గొప్ప‌గా ఎదుగుతావు.. ఈ రాష్ట్రానికి ముఖ్య‌మంత్రి అవుతావు అని చెప్పి పార్టీలోకి ఆహ్వానించాను. ఇప్పుడు నా మీద ఎందుకు క‌క్ష తీర్చుకుంటున్నారో నాకు అర్థం కావ‌డం లేదు. ఎందుకు న‌న్ను టార్గెట్ చేశారు. నీ వెనుకాల కూర్చున్న అక్క‌ల‌ను న‌మ్ముకోవ‌ద్దు మోసం చేస్త‌రు అని సీఎం అన్నారు. ఏం మోసం చేసినం అధ్య‌క్షా..? ఏం ముంచినం అధ్య‌క్షా..? ఈయ‌న‌ను ముంచామా అధ్య‌క్షా..? ఈయ‌న‌ను బ‌తిమాలిడి పార్టీలోకి రావాల‌ని, భ‌విష్య‌త్‌లో ఈ పార్టీకి ఆశా కిర‌ణం అవుతావు అని ఆహ్వానించాను. రేవంత్‌ను గుండె మీద చేయి వేసుకోమ‌ని చెప్ప‌మ‌ను. ఏం మోసం చేశాను.. ఎన్నిక‌ల స‌మ‌యంలో కూడా అదే మాట్లాడారు. ఎందుకు టార్గెట్ చేస్తున్నావ్‌? ఎందుకు అవ‌మానిస్తున్నావు? నాపై చేసిన వ్యాఖ్య‌ల‌ను రేవంత్ విత్ డ్రా చేసుకోవాలి' అని స‌బితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మాట‌ల‌కు డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌(Deputy CM Bhatti Vikramarka),శాస‌న‌స‌భ వ్య‌వ‌హారాల మంత్రి శ్రీధ‌ర్ బాబు(Minister Sridhar Babu) వంత పాడటం గమనార్హం. గర్హనీయం కూడా! స‌భా నాయ‌కుడు స‌బిత పేరు పెట్టి మాట్లాడ‌లేద‌ని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి ఎవరి గురించి మాట్లాడలేదు, ఒక సూచన, సలహా ఇచ్చారు అంతే అని శ్రీధ‌ర్ బాబు చెప్పుకురావడం ఆశ్చర్యాన్ని కలిగించింది.

సబితా ఇంద్రారెడ్డి మాటలకు రేవంత్‌రెడ్డి కూడా రియాక్టయ్యారు. 'నన్ను స‌బిత‌క్క కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన మాట నిజ‌మే. నేను కూడా స‌బిత‌క్కాను సొంత అక్క‌లాగా అనుకున్నా. కొడంగ‌ల్‌లో ఎమ్మెల్యేగా ఓడిపోతే హైక‌మాండ్‌కు చెప్పి మ‌ల్కాజ్ గిరి(Malkajgiri) ఎంపీ(MP)గా పోటీ చేసే అవ‌కాశం క‌ల్పించింది. కానీ కేసీఆర్ మాయ మాట‌ల‌ను నమ్మి ఆనాడు టీఆర్ఎస్‌(BRS)లో చేరి నా ఓట‌మి కోసం ప్ర‌య‌త్నించింది. వెన‌కాల‌నే ఉండే అక్క‌లు ముంచుతారు' అని చెప్పుకొచ్చారు రేవంత్‌.

ehatv

ehatv

Next Story