తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్ కు వెళ్లారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ లో పోలీసు, ఇతర విభాగాల అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రాబోయే వర్షాకాలానికి సంబంధించి తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై చర్చించారు. ఈ సమావేశానికి పోలీస్, ట్రాఫిక్, జీహెచ్ఎంసీ, విద్యుత్, వాతావరణ శాఖతో పాటు ఇతర విభాగాల అధికారులు హాజరయ్యారు.

సీఎం హోదాలో తొలిసారి శనివారం సాయంత్రం రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు వచ్చారు. ముఖ్యమంత్రికి డీజీపీ రవి గుప్తా, సీఎస్ శాంతికుమారి స్వాగతం పలికారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సైబర్ సెక్యూరిటీ, నార్కోటింగ్ వింగ్‌లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డ్రగ్స్ నిర్మూలనకు అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు.

Updated On 25 May 2024 8:22 AM GMT
Yagnik

Yagnik

Next Story