తెలంగాణ కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఆయన ఎమ్మెల్యేగా గెలవకముందు మల్కాజ్‌గిరి ఎంపీగా ఉన్నారు. ఈ రోజు లోక్ సభకు వెళ్ళిన రేవంత్ రెడ్డి రాజీనామా లేఖను పార్లమెంట్ సెక్రటరీకి అందజేశారు. రేపు మధ్యాహ్నం 1.04 గంటలకు ఆయన తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Telangana Congress
తెలంగాణ కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఆయన ఎమ్మెల్యేగా గెలవకముందు మల్కాజ్‌గిరి ఎంపీగా ఉన్నారు. ఈ రోజు లోక్ సభకు వెళ్ళిన రేవంత్ రెడ్డి రాజీనామా లేఖను పార్లమెంట్ సెక్రటరీకి అందజేశారు. రేపు మధ్యాహ్నం 1.04 గంటలకు ఆయన తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రకటన చేసింది.
ఇదిలావుంటే.. ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) కూడా మంగళవారం ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఆయన నల్గొండ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా గెలుపొందారు. మరో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Komati Reddy Venkata Reddy) కూడా ఈ రోజు ఎంపీ పదవికి రాజీనామా చేయనున్నారు. ఆయన భువనగిరి లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా గెలుపొందారు. 2018 అసెంబ్లీ ఎన్నికలలో ఈ ముగ్గురు నేతలూ ఓడిపోయి.. తర్వాత ఎంపీలుగా పోటీచేసి గెలుపొందారు. తాజాగా జరిగిన ఈ ఎన్నికలలో ముగ్గురూ విజయం సాధించడంతో ఎంపీ పదవులకు రాజీనామా చేశారు.
