తెలంగాణ సచివాలయం(Telangana Secretariat) ముందర దివంగత మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌గాంధీ(Rajiv gandhi) విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నారు.
తెలంగాణ సచివాలయం(Telangana Secretariat) ముందర దివంగత మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌గాంధీ(Rajiv gandhi) విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. లుంబినీ పార్కు(Lumbini park), తెలంగాణ అమరవీరుల స్మారకం ముందు ఉన్న ఖాళీ జాగాను పచ్చదనంతో ఉండేలా డిజైన్ చేసి పనులు ప్రారంభించాలని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ)కి రేవంత్‌రెడ్డి సర్కారు సూచించింది. కొత్త సచివాలయం నిర్మాణం తర్వాత తెలుగుతల్లి విగ్రహం కూడలిని పూర్తిగా తొలగించి సరికొత్తగా తీర్చిదిద్దుతున్నారు. రాజీవ్‌గాంధీ విగ్రహం ఏర్పాటుతోపాటు దాని చుట్టు పక్కల అభివృద్ధికి సుమారు 1.74 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. హుస్సేన్‌సాగర్ తీరంలో ఉన్న ఈ ప్రాంతాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్ది, ట్రాఫిక్ సమస్యలు లేకుండా పార్కింగ్ స్థలాలు, వాహనాల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా ల్యాండ్ స్కేపింగ్ చేస్తున్నట్టు హెచ్‌ఎండీఏ అధికారులు తెలిపారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మించిన నూతన సచివాలయాన్ని వీక్షించడానికి వివిధ ప్రాంతాలను రోజూ ప్రజలు వస్తున్నారు.