టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. ఎల్బీస్టేడియం(LB Stadium)లో ఘనంగా జరిగిన కార్యక్రమంలో గవర్నర్ తమిళి సై రేవంత్ రెడ్డితో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించారు.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. ఎల్బీస్టేడియం(LB Stadium)లో ఘనంగా జరిగిన కార్యక్రమంలో గవర్నర్ తమిళి సై రేవంత్ రెడ్డితో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించారు. ఎనుముల రేవంత్ రెడ్డి అనే నేను అంటూ రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తుండగా.. స్టేడియం హోరెత్తిపోయింది. కాంగ్రెస్ కార్యకర్తలు, రేవంత్ రెడ్డి అభిమానులు పెద్ద ఎత్తున కేరింతలు కొట్టారు. జై రేవంత్ అన్నా అంటూ నినాదాలు చేశారు. వేదికపై సీఎం రేవంత్ రెడ్డితోపాటు కాంగ్రెస్ అగ్రనేతలు మల్లిఖార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతోపాటు రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు కూడా ఆశీనులయ్యారు.