కోర్టు చెప్పినా ప్రభుత్వం నాకు సెక్యూరిటీ ఇవ్వడం లేదని రేవంత్ రెడ్డి(Revanth Reddy) మండిప‌డ్డారు. ఎంపీగా ఉన్నాను, జాతీయపార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న నాకు సెక్యూరిటీ తొలగిస్తారా? అని నిప్పులు చెరిగారు. కాంగ్రెస్(Congress) అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్(KCR) కి కావాల్సినంత సెక్యూరిటీ ఇచ్చాం.. నేను ప్రజల మనిషిని.. నాకు సెక్యూరిటీతో పనిలేదన్నారు.

కోర్టు చెప్పినా ప్రభుత్వం నాకు సెక్యూరిటీ ఇవ్వడం లేదని రేవంత్ రెడ్డి(Revanth Reddy) మండిప‌డ్డారు. ఎంపీగా ఉన్నాను, జాతీయపార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న నాకు సెక్యూరిటీ తొలగిస్తారా? అని నిప్పులు చెరిగారు. కాంగ్రెస్(Congress) అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్(KCR) కి కావాల్సినంత సెక్యూరిటీ ఇచ్చాం.. నేను ప్రజల మనిషిని.. నాకు సెక్యూరిటీతో పనిలేదన్నారు. నేను సెక్యూరిటీ లేకుండా ఎక్కడికైనా వస్తాను.సెక్యూరిటీ లేకుండ ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలకు కేసీఆర్ రాగలరా? ప్ర‌శ్నించారు. నన్ను ఓడించడానికి పోలీసులను కేసీఆర్ వాడుకున్నారని..సెక్యూరిటీ విషయంలో నన్ను భయపెట్టాలని చూస్తే భయపడేవాడ్ని కాదన్నారు. లక్షలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు నా సైన్యం. నా సెక్యూరిటీ వాళ్ళేన‌ని అన్నారు.

కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ, మైనార్టీ అనే తేడా ఉండదన్నారు. కాంగ్రెస్ పార్టీలో మైనార్టీలు చాలా పెద్ద పొజీష‌న్‌లో ఉన్నారని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ మైనార్టీల కోసం ఏం చేయలేదన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్లో ఒక్క పర్సెంట్ కూడా మైనార్టీలకు దక్కలేదన్నారు. ఇక్కడ కారు బయల్దేరి ఢిల్లీకి చేరే వరకు అది కమలంగా మారిపోతోందని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ కి ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్టే.. కేసీఆర్ మైనార్టీ ఓట్లను బీజేపీకి అమ్ముకుంటున్నారని ఆరోపించారు.

మైనార్టీలందరూ కాంగ్రెస్ వైపే చూస్తున్నారని అన్నారు. బీజేపీ తెచ్చిన ప్రతి ప్రజా వ్యతిరేక బిల్లుకి కేసీఆర్ మద్దతు ఇచ్చారని గుర్తుచేశారు. బీజేపీ, బీఆర్ఎస్ వేరువేరు కాదు.. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్నామని చెప్పడానికి ఎక్కడికైనా వస్తామ‌ని తెలిపారు. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్నామని గుడి, మసీదు, చర్చి ఎక్కడికైనా వచ్చి చెప్తాం. బీఆర్ఎస్ వాళ్ళు అలా చెప్పగలరా? అని స‌వాల్ విసిరారు.

Updated On 18 Aug 2023 5:26 AM GMT
Ehatv

Ehatv

Next Story