బీఆర్‌ఎస్(BRS)తో పొత్తుపై తెలంగాణ పీసీసీ చీఫ్(Telangana Chief) రేవంత్‌రెడ్డి (Revanth Reddy)సంచలన వ్యాఖ్యాలు చేశారు. తాను అధ్యక్షుడిగా ఉన్నంత కాలం కాంగ్రెస్(Congress), బీఆర్‌ఎస్(BRS) మధ్య పొత్తు ఉండదని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్‌కు పోయేకాలం దాపురించిందన్నారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్(KCR)పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని రేవంత్ చెప్పారు. రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సింగిల్ డిజిట్‌కే పరిమితమవుతుందని జోస్యం చెప్పారు.
బీఆర్‌ఎస్(BRS)తో పొత్తుపై తెలంగాణ పీసీసీ చీఫ్(Telangana Chief) రేవంత్‌రెడ్డి (Revanth Reddy)సంచలన వ్యాఖ్యాలు చేశారు. తాను అధ్యక్షుడిగా ఉన్నంత కాలం కాంగ్రెస్(Congress), బీఆర్‌ఎస్(BRS) మధ్య పొత్తు ఉండదని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్‌కు పోయేకాలం దాపురించిందన్నారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్(KCR)పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని రేవంత్ చెప్పారు. రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సింగిల్ డిజిట్‌కే పరిమితమవుతుందని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి 20, 30 సీట్లు వస్తే లాభముండదని, అంత తక్కువ సీట్లు వస్తే వారంతా బీఆర్‌ఎస్‌కే వెళ్లిపోతారని రేవంత్ విశ్లేషించారు. అందుకే కాంగ్రెస్‌పార్టీకి 60 స్థానాలు కావాలి. తమను పూర్తి మెజారిటీతో గెలిపించే బాధ్యత ప్రజలదేనన్నారు. కాంగ్రెస్‌కు 20 సీట్లు వస్తే బీఆర్‌ఎస్‌కే వెళ్లిపోతారు కాబట్టి జనం 80 సీట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని రేవంత్‌రెడ్డి అన్నారు. తాము ఎవరినైనా క్షమిస్తాం కానీ, కేసీఆర్‌ను క్షమించేది లేదని రాహుల్‌గాంధీ చెప్పిన మాటను రేవంత్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెలంగాణలో ఇప్పుడు స్వేచ్ఛ లేకుండా పోయిందని విమర్శించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో, అంతకు ముందు నిజాం పాలనలో కూడా ఎంతో అభివృద్ధి జరిగిందని, కానీ తెలంగాణ ప్రజలు స్వేచ్ఛ కోసమే పోరాటం చేశారని రేవంత్ అన్నారు. బీఆర్‌ఎస్, బీజేపీ, ఎంఐఎంలు ఒక్కటేనని, మూడింటి మధ్య ట్రయాంగిల్ లవ్ ఉందని చెప్పారు. బీజేపీతో కొట్లాడినట్టు నటిస్తూనే కాంగ్రెస్‌ను మింగేస్తారని, ధృతరాష్ట్ర కౌగిలికి తాము సిద్ధంగా లేమని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.