తెలంగాణ కాంగ్రెస్ తరపున టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి జాతీయ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఆదివారం ఆయ‌న మాట్లాడుతూ.. సీడబ్ల్యూసీ సమావేశాలు ఇక్కడ ఏర్పాటు చేయడం తెలంగాణకు ఎంతో కీలకం అన్నారు.

తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) తరపున టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) జాతీయ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఆదివారం ఆయ‌న మాట్లాడుతూ.. సీడబ్ల్యూసీ సమావేశాలు(CWC Meeting) ఇక్కడ ఏర్పాటు చేయడం తెలంగాణ(Telangana)కు ఎంతో కీలకం అన్నారు. బీఆర్ఎస్(BRS), ఎంఐఎం(MIM).. బీజేపీ(BJP)కి పరోక్ష మద్దతుదారులు అని.. 2024 ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన విధానాలపై నిన్న సీడబ్ల్యూసీ సమావేశంలో చర్చించాం అని తెలిపారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలపై ఇవాళ జరిగే సమావేశంలో చర్చిస్తామ‌న్నారు. సాయంత్రం జరిగే విజయభేరిలో సోనియాగాంధీ(Sonia Gandhi) గ్యారంటీలను ప్రకటిస్తారని వెల్ల‌డించారు.

బోయిన్ పల్లి రాజీవ్ గాంధీ నాలెడ్జ్ సెంటర్(Rajeev Gandhi Knowledge Center) కు సభలోనే శంఖుస్థాపన చేస్తారని తెలిపారు. తెలంగాణ ఇస్తామని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నట్టే.. ఇవాళ విజయభేరిలో ఇవ్వబోయే గ్యారంటీలను కాంగ్రెస్ అమలు చేస్తుందని అన్నారు. అధికారంలోకి వచ్చిన మొదటి వంద రోజుల్లో పథకాలు అన్నీ అమలు చేసేలా గ్యారెంటీ ఇవ్వబోతున్నాం.. సాయంత్రం తుక్కుగూడలో జరిగే విజయభేరి సభకు లక్షలాదిగా తరలిరావాలని విజ్ఞప్తి చేశారు.

కాళేశ్వరం(Kaleshwaram) అక్రమ సొమ్ముతో ఢిల్లీ లిక్కర్ స్కాం(Delhi Liquore Scam)లో పెట్టుబడులు పెట్టిన బీఆర్ఎస్‌.. వాటాలు పొందుతున్న బీజేపీ.. కాంగ్రెస్ ను నిందించడం తప్ప ఏం చేయగలరని విమ‌ర్శించారు. తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ ను విమర్శిస్తున్నారని ఎదురుదాడి చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ చీకటి ఒప్పందాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. సానుభూతి పవనాలతో ఎన్నికల్లో గెలవాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఎన్నికల్లో గెలిచేందుకు కూతురిని కూడా అరెస్టు చేయించి సానుభూతి పొందాలనుకునే వ్యక్తి కేసీఆర్(KCR) అని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కవితను తీహార్ జైలులో పెట్టి సానుభూతి పొందాలని మోదీ(PM Modi)తో కేసీఆర్ ఒప్పందం చేసుకున్నారని.. ఇందుకు కేసీఆర్ మోదీకి సహకరిస్తున్నారని అన్నారు.

ఏ లక్ష్యంతో సోనియా తెలంగాణ ఇచ్చారో ఆ లక్ష్యం నెరవేరలేదన్నారు. ఆ లక్ష్యాన్ని, కలను నెరేవేర్చేందుకే ఇవాళ విజయభేరి సభ నిర్వ‌హిస్తున్నామ‌ని తెలిపారు. ఎంఐఎం, బీఆర్ఎస్, బీజేపీ సభలకు లేని ఆంక్షలు కాంగ్రెస్ కే ఎందుకు? అని ప్ర‌శ్నించారు. కొంతమంది పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని మండిప‌డ్డారు. కేసీఆర్ పాలమూరు ప్రాజెక్టు ప్రారంభించడం.. కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా ఉందని సెటైర్లు విసిరారు. ఆర్భాటం కోసమే కేసీఆర్ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంభించారని ఆరోపించారు. కేసీఆర్, కిషన్ రెడ్డి వేర్వేరు కాదని అన్నారు. ఒక్కొక్కరుగా ఎదుర్కోలేకనే బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం మూకుమ్మడిగా కాంగ్రెస్ పై దాడికి దిగుతున్నాయని.. అందుకు నిదర్శనమే ఇవాళ ఆ మూడు పార్టీల సభలు, కార్యక్రమాలు అని వివ‌రించారు.

కేసీఆర్ ప్రభుత్వంపై బీజేపీ ఈగ వాలనివ్వడం లేదని అన్నారు. ఈడీ(ED), సీబీఐ(CBI) ఒక్క కేసు కూడా పెట్టలేదన్నారు. కేసీర్ అవినీతిపై ఎందుకు విచారణకు ఆదేశించలేదు? అని ప్ర‌శ్నించారు. కేజ్రీవాల్ ప్రభుత్వంపై ఈడీ కేసులో కవిత ఇరుక్కున్నారు. అంతేగాని బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఒక్క కేసు కూడా పెట్టలేదని అన్నారు. సోనియాను, రాహుల్(Rahul Gandhi) ను ఈడీ వేధించింది కనిపించడం లేదా.? 100 కోట్లకే మంత్రులను జైలుకు పంపితే... మరి లక్ష కోట్లు తిన్న కేసీఆర్ ను ఉరేయాలని అన్నారు.

Updated On 16 Sep 2023 11:17 PM GMT
Yagnik

Yagnik

Next Story